
Health Tips: ప్రెగ్నెన్సీలో 'టీ' తాగడం సురక్షితమేనా? నిపుణులు ఏమంటున్నారంటే..
Health Tips: కాఫీన్ మోతాదుపై జాగ్రత్త అవసరం.. గర్భధారణ సమయంలో టీ తాగేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ప్రెగ్నెన్సీలో తీసుకునే ఆహారం కేవలం తల్లి కోసమే కాదు, లోపల పెరుగుతున్న శిశువు ఆరోగ్యం కోసం కూడా చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. సరైన పోషకాహారం తీసుకోకపోతే బలహీనత, రక్తహీనత, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో చాలా మందికి ఉదయాన్నే 'టీ' తాగే అలవాటు ఉంది. అయితే గర్భంతో ఉన్నప్పుడు టీ తాగడం ఎంతవరకు సురక్షితం? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు.. అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గర్భధారణ సమయంలో టీ తాగవచ్చా..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గర్భధారణ సమయంలో టీని మితంగా తాగడం సురక్షితమే అని అంటున్నారు. అయితే అతిగా తాగితే మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. టీలో ఉండే కొన్ని పదార్థాల కారణంగా శరీరం ఐరన్‌ను గ్రహించకుండా అడ్డుకుంటాయని వెల్లడించారు. దీనివల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. అధికంగా టీ తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు పెరుగుతాయన్నారు. టీలోని కెఫిన్ వల్ల కొందరిలో హృదయ స్పందన రేటు పెరగడం, నిద్ర పట్టకపోవడం, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయని సూచించారు. రోజుకు ఒక కప్పు టీకి పరిమితం కావడం మంచిదని, అలాగే మీకు వికారం లేదా తీవ్రమైన అసిడిటీ సమస్య ఉంటే టీకి దూరంగా ఉండటమే శ్రేయస్కరం అని చెప్పారు.
టీకి బదులుగా..
టీ తాగాలనిపించినప్పుడు దానికి బదులుగా ఈ ఆరోగ్యకరమైన పానీయాలను ప్రయత్నించండి..
* కొబ్బరి నీళ్లు: ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది, అలాగే శరీరానికి సహజమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తుంది.
* గోరువెచ్చని పాలు: పాలు తాగడం వల్ల తల్లికి, బిడ్డకు అవసరమైన కాల్షియం అందుతుంది.
* అల్లం టీ: ఇది గర్భధారణ సమయంలో వచ్చే 'మార్నింగ్ సిక్నెస్' (వికారం) నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
* నిమ్మరసం: జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి విటమిన్-సి అందిస్తుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




