జాగింగ్ ఆ సమయంలో చేస్తేనే మేలట!

జాగింగ్ ఆ సమయంలో చేస్తేనే మేలట!
x
Highlights

ఈ మధ్య చాలా మందికి ఆరోగ్యంపై సృహ పెరిగింది. పెరుగుతున్న రోగాలు,వెంటాడుతున్న జబ్బులు ఉదయం లేవగానే పరుగులు పెట్టేలాచేస్తున్నాయి. రకరకాల ఎక్సర్‌సైజులు,...

ఈ మధ్య చాలా మందికి ఆరోగ్యంపై సృహ పెరిగింది. పెరుగుతున్న రోగాలు,వెంటాడుతున్న జబ్బులు ఉదయం లేవగానే పరుగులు పెట్టేలాచేస్తున్నాయి. రకరకాల ఎక్సర్‌సైజులు, జిమ్‌లో బరువులు ఎత్తుతూ తెగ కష్టపడిపోతున్నారు. అయితే ఫిట్‌నెస్ కోసం జిమ్‌‌కు వెళ్తూ బరువులు మోస్తు అంతా కష్టపడనవసరం లేదు. వాటి కంటే ఉత్తమైన వర్క్ఔట్ జాగింగ్ అని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే కొంచెం చమట చిందిస్తే చాలు. ఎవరు టైంను బట్టి ఫిట్ నెస్ కోసం సమయం కేటాయిస్తున్నారు. ఎక్కువ మంది ఉదయాన్నే జాగింగ్, చేస్తే కొద్దిమంది మాత్రం సాయంత్రం వేళల్లో చేస్తుంటారు. అయితే జాగింగ్ ఏ సమయంలో చేస్తే మంచిదనే సందేహం చాలామందిలో ఉంటుంది.

ఈ విషయంపై కాలిఫోర్నియా, ఇజ్రాయిల్ యూనివర్శిటీలు పరిశోధనలు కూడా చేశారు. ఉదయం కంటే సాయంత్రం జాగింగే బెటర్ అని తేల్చారు. ఈ ప్రయోగానికి శాంపిల్‌గా ఎలుకల తీసుకుని వాటి మీద ప్రయోగాలు చేశారు. ట్రెడ్‌మిల్స్‌పై రోజూ వాటిని వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఎక్సర్‌సైజులు చేయించారు. అనంతరం ఫిట్‌నెస్ నమోదు చేశారు. ఉదయం జాగింగ్ చేసిన ఎలుకల కంటే సాయంత్రం జాగింగ్ చేసిన ఎలుకలే 50 శాతం యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. దీంతో మార్నింగ్ వర్క్‌అవుట్ చేసే వారికి కంటే ఈవినింగ్ వర్క్‌అవుట్స్ చేసేవారిలోనే యాక్టీవ్ నెస్ ఉంటుందని నిర్ధారించారు. సాయంత్రం సమయంలో జాగింగ్ వంటి ఎక్సర్‌సైజులు చేస్తే మెటబాలి మెరుగుగా ఉంటుందని తెలిపారు.

కావున ఉదయం జాగింగ్ చేయలేదని మానేసివాళ్ళు ఇక సాయంత్రమైన చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ గందరగోళ షెడ్యూల్‌లో నిత్యం జీవనపోరాటం సాగిస్తున్న సగటు మనిషి ఫిట్‌గా ఉండడటం అవసరం. జాగింగ్ కు వెళ్లడానికి బద్ధకంగా అనిపిస్తే మీకు తోడొచ్చే కుటుంబసభ్యులు.. సేహ్నితులను ఆఖరికి పెంపుడు కుక్కతోనైన తోడు తీసుకెళ్ళండి. కాంక్రిట్ జంగిల్‌లో మనిషి బద్దకంగా మారిపోయాడు. అపార్ట్‌మెంట్‌ ఎక్కాలన్నా దిగాలన్నా లిఫ్ట్‌ తప్పనిసరి.. ఆఫీసుల్లో కూడా అంతే. అందుకే కనీసం రోజు జాగింగ్ చేసి ఆరొగ్యాన్ని కాపాడుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories