Iron: ఐరన్‌ పుష్కలంగా ఉండే 10 పండ్లు ఇవే.. మీ డైట్‌లో ఉన్నాయా మరీ?

Iron: ఐరన్‌ పుష్కలంగా ఉండే 10 పండ్లు ఇవే.. మీ డైట్‌లో ఉన్నాయా మరీ?
x
Highlights

Iron Rich 10 Fruits: మన శరీరంలో ఎప్పటికప్పుడు ఐరన్‌ స్థాయిలు తగ్గకుండా చూసుకోవాలి. లేకపోతే ఎనీమియా వస్తుంది.

Iron Rich 10 Fruits: ఐరన్‌ స్థాయిలు తగ్గిపోతే తరచూ నీరసం వస్తుంది. ఏ చిన్న పనిచేసినా అలసిపోతారు. అంతేకాదు ఇది ఎనీమియాకు కూడా దారితీస్తుంది. ఇది ప్రధానంగా మహిళల్లో కనిపిస్తుంది. అయితే, సహజంగా ఐరన్‌ లభించే 10 పండ్లు ఉన్నాయి. వీటిని డైట్‌లో చేర్చుకుంటే చాలు ఐరన్‌ స్థాయిలు రాకెట్‌ స్పీడ్‌లో పెరుగుతాయి.

అప్రికాట్స్‌..

డ్రై అప్రికాట్స్‌ డైట్‌లో చేర్చుకుంటే ఐరన్‌ పుష్కలంగా అందుతుంది. ఈ అప్రికాట్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన రక్త నిర్వహణకు తోడ్పడుతుంది. అప్రికాట్లు తక్షణ శక్తి అందిస్తుంది. ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. రుచికరంగా ఉంటాయి కాబట్టి ఈవెనింగ్‌ స్నాక్స్‌లో తీసుకోవచ్చు.

ప్రూన్స్..

ప్రూన్స్‌లో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని సైతం పెంచుతుంది. దీంతో ఎనీమియా మీ దరిదాపుల్లోకి కూడా రాదు. ఆరోగ్యకరమైన పేగుకదలికలకు తోడ్పడుతుంది.

మల్బర్రీ పండ్లు..

మల్బర్రీ పండ్లలో ఐరన్‌, విటమిన్‌ సీ, ఫైబర్‌ ఉంటాయి. ఇవి రక్తప్రసరణను ప్రేరేపిస్తాయి. ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. మల్బర్రీ పండ్లలో గుండె ఆరోగ్యానికి తోడ్పడే గుణాలు ఉంటాయి.

ఖర్జూరం..

ఇది పోషకాలకు పవర్‌హౌస్‌. ఇది హిమోగ్లోబిన్‌ స్థాయిను కూడా పెంచుతుంది. ఖర్జూరం తక్షణ శక్తి అందిస్తాయి. జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఖర్జూరం రుచిగా, పోషకాలు కూడా అందుతాయి.

దానిమ్మ..

దానిమ్మలో మంచి రక్తసరఫరాకు కూడా తోడ్పడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మన శరీర ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు కూడా లభిస్తాయి.

దానిమ్మ గింజలు లేదా జ్యూస్‌ తాగవచ్చు.

ఎండుద్రాక్ష..

ఎండుద్రాక్షలో కూడా ఐరన్‌ ఉంటుంది. ఇది కూడా రక్తప్రసరణ కూడా మెరుగు చేస్తుంది. ఇది సహజసిద్ధంగా శక్తిని అందిస్తుంది. గుండె, ఎముక ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

కొబ్బరి బోండం..

ఇందులో కూడా ఐరన్ ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. శరీరానికి రోజంతటికీ కావాల్సిన శక్తిని కూడా ఈ నీరు అందిస్తుంది. తక్షణ శక్తిని కూడా ఇస్తాయి.

బ్లాక్‌బెర్రీ..

ఈ పండ్లలో కూడా ఐరన్‌ ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఇమ్యూనిటీ పెంచే గుణాలు ఉంటాయి. గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇది విటమిన్స్‌, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు కలగలిపి ఉన్న పవర్‌ఫుల్‌ పండు.

పుచ్చకాయ..

పుచ్చకాయలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్‌ సీ కూడా ఉంటుంది. రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్‌ కూడా అందిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మానికి ప్రేరేపిస్తుంది.

అత్తిపండు..

ఈ పండులో కూడా ఐరన్‌, ఫైబర్‌, క్యాల్షియం ఉంటాయి. ఇది ఎముక బలంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఇది రుచికరమైన స్నాక్‌ కూడా.

Show Full Article
Print Article
Next Story
More Stories