Top
logo

ఐరన్ ఎవరెవరికి ఎంత అవ‌స‌రం అంటే..?

ఐరన్ ఎవరెవరికి ఎంత అవ‌స‌రం అంటే..?
X
Highlights

మ‌న శ‌రీరంలోని ప్ర‌తి క‌ణానికి ఆక్సిజ‌న్ అందాలంటే.. అందుకు ఐర‌న్ సహయపడుతుంది. ర‌క్తంలో ఉన్న ఆక్సిజ‌న్‌ను...

మ‌న శ‌రీరంలోని ప్ర‌తి క‌ణానికి ఆక్సిజ‌న్ అందాలంటే.. అందుకు ఐర‌న్ సహయపడుతుంది. ర‌క్తంలో ఉన్న ఆక్సిజ‌న్‌ను

ఈ ఖనిజం క‌ణాలకు చేరుస్తుంది. ఐర‌న్ లోపం వల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య మాత్ర‌మే కాకుండా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా తలేత్తుతాయి. అందువల్ల రోజు ఐర‌న్ పుష్క‌లంగా ఉన్న ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో శరీరంలో ఐర‌న్ లోపం రాకుండా

ఉంటుంది.

ఎవరికి ఎంత ఐరన్ అవసరం

పుట్టిన పిల్ల‌ల నుంచి 6 నెల‌ల వ‌యస్సు ఉన్న పిల్ల‌ల‌కు నిత్యం 0.27 మిల్లీగ్రాముల ఐర‌న్ అవ‌స‌రం ఉంటుంది.

7 నుంచి 12 నెల‌ల వ‌య‌స్సున్న చిన్నారుల‌కు రోజులో 11 మిల్లీగ్రాములు

1 నుంచి 3 సంవ‌త్స‌రాల వ‌యస్సు ఉన్న పిల్ల‌ల‌కు 7 మిల్లీగ్రాములు

4 నుంచి 8 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ వారికి 10 మిల్లీగ్రాములు,

9 నుంచి 13 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌వారికి 8 మిల్లీగ్రాములు,

14 నుంచి 18 ఏళ్ల వారిలో మ‌గ‌వారికి 11 మిల్లీగ్రాములు, ఆడ‌వారికి 15 మిల్లీగ్రాములు,

19 నుంచి 50 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌వారిలో మ‌గవారికి నిత్యం 8 మిల్లీగ్రాములు,మహిళలలో నిత్యం 18 మిల్లీగ్రాముల ఐర‌న్ అవ‌స‌రం అవుతుంది.

అలాగే 51 ఏళ్ల పైబ‌డిన వారికి నిత్యం 8 మిల్లీగ్రాముల ఐర‌న్ కావాలి.

రోజు తీసుకునే ఆహారంలో ముఖ్యంగా కూరగాయలు,మాంసాహారంలో ఎక్కువగా ఐరన్ లభిస్తుంది. పాల‌కూర‌, మున‌గాకు

టమాటాలు, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, న‌ట్స్, కోడిగుడ్లు, సోయా, జీడిప‌ప్పు, మ‌ట‌న్‌, మ‌ట‌న్ లివ‌ర్‌, రొయ్య‌లలో ఎక్కువగా ఇనుము

లభిస్తుంది. నిత్యం వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఐర‌న్ లోపాన్ని అధిగ‌మించ‌వ‌చ్చు. I

Next Story