ఆ చెట్టే క్రికెట్ బ్యాట్‌లకు అమ్మ.. వాటిని చూస్తే..

ఆ చెట్టే క్రికెట్ బ్యాట్‌లకు అమ్మ.. వాటిని చూస్తే..
x
Highlights

క్రికెట్ ఇండియాతో పాటు ఇతర దేశాల్లో చాలమందికి ఇష్టమైన ఆట. గల్లీ నుంచి దిల్లీ దాకా.. అనకాపల్లి నుంచి అమెరికా వరకు క్రికెట్ అంటే ప్రాణం తీసుకునే వారు...

క్రికెట్ ఇండియాతో పాటు ఇతర దేశాల్లో చాలమందికి ఇష్టమైన ఆట. గల్లీ నుంచి దిల్లీ దాకా.. అనకాపల్లి నుంచి అమెరికా వరకు క్రికెట్ అంటే ప్రాణం తీసుకునే వారు చాలమందే ఉన్నారు. అయితే క్రికెట్‌ బ్యాట్‌ల తయారీలో ఎక్కువగా ఉపయోగించే చెట్టు అంటే 'విల్లో'. దాదాపు విల్లో జాతిలో 12 రకాలున్నాయి. బ్లాక్‌ విల్లో, వైట్‌ విల్లో, డైమండ్‌ విల్లో... ఇలా వాటి పేర్లుంటాయి. అయితే కిందికి వేలాడే ఆకులతో ఉన్న చెట్లు ఫేమస్సు.

కశ్మీర్‌లాంటి చల్లగా ఉండే ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతుంటాయి. విల్లో జాతి రకం చెట్లు ఎక్కువగా ఆసియా, ఐరోపాల్లో కనిపిస్తుంటాయి. ఈ చెట్లు.. పొట్టి కాండం, పెద్ద కొమ్మలూ ఉంటాయి. వాటికి పొడవైన తీగ రెమ్మలు చూడటానికి చాల అందంగా ఉంటాయి. ఆకులు కిందివైపునకు వేలాడుతూ చుట్టూ ఉన్న

ప్రదేశాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి. అయితే కొన్ని దేశాల్లో ఇలా వేలాడే చెట్లను విచారానికి గుర్తుగా భావిస్తారు. ఆ చెట్లను చూస్తే దుఖం వస్తుందని బావిస్తుంటారు. అందకనే అలాంటి వాటిని వీపింగ్‌ విల్లో అనీ పిలిచేస్తుంటారు.

విల్లో చెట్లను ఈజిప్టు, గ్రీస్‌, ఇరాక్‌లాంటి దేశాల్లో ఔషధాల్లో వాడుతుంటారు. ఇక ఆ చెట్ల ఆకులు, కాండాల్ని.. నొప్పులు, జ్వరాల మందుల్లో ఉపయోగిస్తారు. ఆ చెట్లనుండి వచ్చేకలప మెత్తగా ఎలాగైనా మలచడానికి వీలుగా ఉంటుంది. దీంతో పెద్ద పెద్ద కళారూపాల దగ్గర నుంచి క్రికెట్‌ బ్యాట్‌ల వరకూ అన్నింటినీ తయారు చేస్తారు. ఇంట్లో ఫర్నిచర్‌‌కి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories