ఆ చెట్ల నుంచి కారేది పాలు కాదు రక్తం !

ఆ చెట్ల నుంచి కారేది పాలు కాదు రక్తం !
x
Highlights

చెట్ల నుంచి పాలు కారుతుంటాయి కానీ రక్తం కారుతుందా అని అనుకోకండి.. మనకు దెబ్బ తగిలితే రక్తం ఎలా వస్తుందో.. ఆ చెట్లకు కూడా అలానే రక్తం కారుతుంది. ఇంతకీ...

చెట్ల నుంచి పాలు కారుతుంటాయి కానీ రక్తం కారుతుందా అని అనుకోకండి.. మనకు దెబ్బ తగిలితే రక్తం ఎలా వస్తుందో.. ఆ చెట్లకు కూడా అలానే రక్తం కారుతుంది. ఇంతకీ ఇలాంటి చెట్లు ఎక్కడ ఉంటాయంటే.. హిందూ మహా సముద్రంలో ఉంటాయి. యెమన్‌ దేశంలో సొకొట్రా అనే ఓ దీవి ఉంది. చిత్రవిచిత్రన జీవ జాతులతో ఆ దీవి ఉంటుంది. డ్రాగన్‌ బ్లడ్‌ ట్రీ, సొకొట్రా డ్రాగన్‌ ట్రీ అనే అరుదైన రకం చెట్లు ఇక్కడే కనిపిస్తాయి.

ఇక ఆ చెట్టు కొమ్మల్ని విరిచినా, చెక్కినా రక్తం కారుతుంది. రక్తమంటే మనకు కారే రక్తం కాదు. ఇదో ఎర్రని ద్రవం. చూడ్డానికి అచ్చం రక్తంలానే ఉంటుంది. ఇక వీటి జీవిత కాలం 650 సంవత్సరాలు. ఇక ఆ చెట్టు ఆకులతో తాళ్లు చేస్తుంటారు. ఆ చెట్ల నుంచి కారే ఎర్రటి ద్రవాన్ని చాలా రకాల ఔషధాల్లో వాడుతుంటడం విశేషం. ఇంకా పెయింటింగ్స్‌ వేయడానికి, ఫర్నిచర్‌ వార్నిష్‌గా ఆ ఎర్రటి ద్రవాన్ని వాడుతుంటారు. టూత్‌పేస్ట్‌, లిప్‌స్టిక్‌, జిగురు తయారీల్లో ఆ ద్రవాన్ని కలపడం మరో విశేషం.

కొమ్మల్ని కత్తిరించి గొడుగులా తీర్చిదిద్దినట్టు ఉంటుంది ఆ చెట్టు ఆకారం. 39 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు సన్నగా పొడుగ్గా ఉంటాయి. ఇక కొమ్మల చివర్లో ఆకుపచ్చ రంగు పూలు పూస్తాయి. నారింజ రంగులో ద్రాక్షంత సైజు పండ్లు కాస్తాయి. కొన్ని పక్షులు ఆ పండ్లుని తింటూ ఉంటాయి. పక్షులు పడేసిన గింజలే పెరిగే మళ్లి పెద్ద వృక్షాలుగా తయారవుతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories