టిక్‌టాక్‌‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫీచర్‌

Instagram
x
Instagram
Highlights

సోషల్ మీడియా యాప్‌లలో టిక్‌టాక్‌కు ఆదరణ అంతా ఇంతా కాదు. టిక్‌టాక్‌తో చాలా మంది సెలబ్రిటులుగా మరిపోయారు.

సోషల్ మీడియా యాప్‌లలో టిక్‌టాక్‌కు ఆదరణ అంతా ఇంతా కాదు. టిక్‌టాక్‌తో చాలా మంది సెలబ్రిటులుగా మరిపోయారు. మొన్నటికి మొన్న టిక్ టాక్ స్టార్ సోనాలి హరియాణా ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసింది. దీంతో టిక్ టాక్‌కు ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు. టిక్‌టాక్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ త్వరలోనే ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పేరిట ఓ నూతన ఈ టూల్ అందుబాటులో రానుంది. ఈఫీచర్ వలన టిక్ టాక్ యాప్ తరహాలోనే యూజర్లు వీడియోను క్రియేట్ చేసి తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ తీసుకొస్తున్న టూల్ పేరు సీన్స్‌‌. సీన్స్‌టూల్‌ను ప్రయోగాత్మకంగా బ్రెజిల్‌లో ఉపయోగించారు. టిక్‌టాక్‌ లాగానే సీన్స్‌టూల్లో కూడా 15 సెంకడ్ల వీడియోను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. కావాల్సిన మ్యూజిక్‌ని ఉపయోగించవచ్చు. అంతే కాకుండా వీడియోను షేర్‌ చేసుకునేందుకు ఓ బటన్ కూడా ఉంది. దాంతో పాటు డ్యూయెట్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం బ్రెజిల్‌లోనే అమలవుతున్నఈ టూల్ ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందా లేదా పూర్తిగా తెలియదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories