వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిది

వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిది
x
Highlights

చాలా మందికి వ్యాయామం ఉదయం చేయడమా? లేక సాయంత్రం చేయడమా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. పొద్దున్నే అంతా హడావిడే ఉంలుంది కదా అని వ్యాయామం సాయంత్రం...

చాలా మందికి వ్యాయామం ఉదయం చేయడమా? లేక సాయంత్రం చేయడమా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. పొద్దున్నే అంతా హడావిడే ఉంలుంది కదా అని వ్యాయామం సాయంత్రం చేయడమే మేలని చాలా మంది అనుకుంటారు. మరికొంత మంది సాయంత్రం సరికి రోజువారీ పనుల్లో బాగా అలిసిపోయి ఉంటాం. అందుకే పొద్దున్నే చేసేయడం బెటర్‌ అనుకుంటారు. అయితే వ్యాయామం ఏ వేళ చేస్తే ఎక్కువ ప్రయోజనం అనేది ఓసారి చూద్దాం? . శాస్త్రవేత్తలు ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వర్క్‌ఔట్స్ ఎప్పుడు చేస్తే మచింది అని కాకుండా రెండు వేర్వేరు వేళల్లో చేసే వ్యాయామ ఫలితాలు వేర్వేరుగా ఉంటున్నాయని మాత్రం చెబుతున్నారు.

ఉదయం చేసే వ్యాయమం ద్వారా షుగర్‌, ఫ్యాట్‌లకు సంబంధించిన జీవక్రియలు సజవుగా జరుగుతాయి. వీటివల్ల అధిక బరువు, టైప్‌- 2 మధుమేహం తగ్గుముఖం పడతాయి.ఉదయం చేసే వ్యాయామాలు జన్యు ప్రణాళికను చైతన్యపరుస్తాయి. కండర కణాల సామర్థ్యాన్ని కూడా పెంచుతాయనీ తెలిపారు. ముఖ్యంగా ఉదయం వ్యాయామాలు షుగర్‌, ఫ్యాట్‌లకు సంబంధించిన జీవక్రియలను తేజోవంతం చేస్తాయని కనుగొన్నారు. అలాగే కొన్ని రకాల ధీర్ఘకాలిక జబ్బులు కూడా నయమవుతాయని వివరించారు.సాయంత్రం చేసే వ్యాయామాల వల్ల క్యాలరీలను బాగా ఖర్చుచేసే సత్తా పెరుగుతుందని కూడా శాస్త్రవేత్తలు వివరించారు. అయితే ఏ వేళ వ్యాయమాలు అనుకూలమో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే అని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories