శనగలు తినండి బరువు తగ్గంచుకోండి..

శనగలు తినండి బరువు తగ్గంచుకోండి..
x
Highlights

శనగాలు అరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిని రోజు తినడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రావణమాంసం కావడంతో ఏ తెలుగింట్లో చూసినా వాయనాలుగా...

శనగాలు అరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిని రోజు తినడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రావణమాంసం కావడంతో ఏ తెలుగింట్లో చూసినా వాయనాలుగా ఇచ్చిపుచ్చుకునే సెనగలు కనిపిస్తూనే ఉంటాయి పండగలప్పుడు మాత్రమే కనిపించే సెనగలని ఉత్తరాద రాష్ట్రాలలో రోజువారీ ఆహారంగా వండుకుంటారు. వీటిల్లోని పోషక విలువలు అనేకంగా ఉంటాయి. వాటి ప్రయోజనాల గురించి మీరూ ఏడాదంతా వండుకుంటారు.

బరువు తగ్గలనుకునే వారికి శనగాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వీటిల్లోని కెలొరీలు తక్కువ. పీచు, ఇతరత్రా పోషకాలు అపారం. రోజు ఉదయం పూట రెండుమూడు చెంచాల సెనగలు తిన్నా, మనం రోజు తినే కాయగూరలు, పండ్లలో ఐదోవంతు తిన్నట్టే. అంతేకాకుండా సెనగలు తిన్నప్పుడు కడుపు నిండిన భావన కలిగుతుంది. దీంతో బయట తిండి తినాలనే కోరిక తగ్గుతుంది దీనివల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.

శాకాహారులకు వీటిని తినడం వల్ల మాంసాహారంలో ఉన్నంత ప్రోటిన్లను పోందుతారు. సాధరణంగా ప్రోటీన్లు అందాలంటే మాంసాహారం తినాల్సిందే, నాన్ వెజ్ అలవాటు లేనివారు వీటిని తింటే మంచిది. , ఇవి శరీరానికి కావాల్సిన ప్రోటీన్లని పుష్కలంగా అందిస్తాయి. వారంలో కనీసం రెండు మూడుసార్లైనా సెనగలని తింటూ ఉండే మహిళల్లో రొమ్ముక్యాన్సర్, కీళ్ల నొప్పుల వంటివి అదుపులో ఉంటాయి. వేయించిన సెనగలని, నెయ్యి, పంచదారను కలిపి తిసుకుంటే జననాంగ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు చెబుతున్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories