రోజూ మీరు వందసార్లు నవ్వితే పావుగంట సైకిల్ తొక్కడంతో సమానం

రోజూ మీరు వందసార్లు నవ్వితే  పావుగంట సైకిల్ తొక్కడంతో సమానం
x
Highlights

నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం.. అంటుంటారు మన పెద్దలు. అలాగే నవ్వు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందని పరిశోధకులు. చెబుతున్నారు .నవ్వుతో అందంగా...

నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం.. అంటుంటారు మన పెద్దలు. అలాగే నవ్వు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందని పరిశోధకులు. చెబుతున్నారు .నవ్వుతో అందంగా కనిపించడమే కాదు నాజూగ్గా కూడా తయారవొచ్చని అంటున్నారు. రోజుకు కనీసం వందసార్లు నవ్వితే అది పావుగంట పాటు సైకిల్ తొక్కడంతో పాటు పది నిమిషాలు రోయింగ్ మెషీన్‌పై వ్యాయామం చేసినంత సమానమట.

నవ్వడం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్ల విడుదలను తగ్గిస్తుంది. నవ్వతూ ఉండడం వల్ల ఒత్తిడిని కలిగించే కార్టిసాల్‌ అనే రసాయనాల ఉత్పత్తి తగ్గి, ఆనందాన్ని రేకెత్తించే ఎండోమార్ఫిన్స్‌ అనే రసాయనాలు విడుదలవుతాయి. అలాగే చల్లని నీళ్ళలో స్నానం చేస్తూ నవ్వుతూ ఫీల్వడం ద్వారా సన్నబడొచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలుఒత్తిడిని తగ్గించడంలో దివ్య ఔషధంగా పని చేసేది నవ్వు. హాయిగా నవ్వితే 80శాతం ఒత్తిడి దూరమవుతుంది.

మానవునికి శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉండేలా నవ్వు ఉపయోగపడుతుంది . నవ్వు. సమస్త జీవరాశులలో మానవునికి మాత్రమే నవ్వే యోగం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడం మన కర్తవ్యం. ''నరుడు తప్పిస్తే నవ్వగలిగిన జీవి ఈ లోకంలోనే లేదు' అన్నారు కవికోకిల జాషువా. కాబట్టి ఇక నుంచి హాయిగా నవ్వకునేలా మీ రోజును మార్చుకొండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories