చేతి గోర్లు పెంచుతుంటే విరిగిపోతున్నాయా..? ఈ వ్యాధులకు సంకేతం..!

If the Hand Nails are Growing are they Breaking a Sign of These Diseases | Tips for Healthy Nails
x

చేతి గోర్లు పెంచుతుంటే విరిగిపోతున్నాయా..? ఈ వ్యాధులకు సంకేతం..!

Highlights

Hand Nails: కొంతమంది మహిళలు, యువతులు చేతి వేళ్ల గోర్లని అందంగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు...

Hand Nails: కొంతమంది మహిళలు, యువతులు చేతి వేళ్ల గోర్లని అందంగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అవి కొంతవరకు పెరిగి తరచూ విరిగిపోతుంటాయి. ఎన్నిసార్లు ట్రై చేసినా ఇదే జరుగుతుంది. అయితే ఇలా జరగడాన్ని కొన్ని వ్యాధులకు సంకేంతంగా చెప్పవచ్చు. ఇది మీ శరీరంలో పోషకాల కొరత అని గుర్తించండి. అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

కాలేయ వ్యాధి ఉన్నప్పుడు కొన్నిసార్లు గోర్లు విరిగిపోవడం, గోరు రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో కాల్షియం లోపం ఉన్నా గోర్లు బలహీనంగా మారుతాయి. తొందరగా విరిగిపోతాయి. అటువంటి పరిస్థితిలో వైద్య నిపుణుడిని సంప్రదిస్తే మంచిది. కాల్షియం లోపాన్ని తీర్చడానికి, పాలు, పెరుగు, జున్ను, అరటిపండు మొదలైనవి తినాలి.

శరీరంలో ప్రొటీన్ లోపించినప్పుడు కూడా గోళ్లు విరగడం తెల్లటి చారలు ఏర్పడడం జరుగుతుంది. దీని కారణంగా ఎముకలు, కండరాలు, చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ పరిస్థితిలో మీ ఆహారంలో మొక్కజొన్న, వోట్స్, బత్తాయి, పాలు, పెరుగు, ముడి చీజ్, గుడ్లు, చేపలు, మొలకెత్తిన ధాన్యాలను చేర్చడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని తీర్చవచ్చు.

గోళ్లు విరగడం నరాలకు సంబంధించిన సమస్యలను సూచిస్తుంది. శరీరంలో విటమిన్ బి-12 లోపం ఉన్నప్పుడు కణాలు సరిగ్గా ఏర్పడక నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండక అనేక సమస్యలు మొదలవుతాయి. విటమిన్ B-12 లోపాన్ని అధిగమించడానికి, చేపలు, గుడ్లు, మాంసం, షెల్ఫిష్, పాలు, పెరుగు, చీజ్ లేదా చీజ్ తినాలి. అలాగే విటమిన్ B-12 సప్లిమెంట్లను కూడా వైద్యుల సలహాపై తీసుకోవచ్చు.

చాలా మంది మహిళల్లో ఐరన్ లోపం కనిపిస్తుంది. ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. చాలా సార్లు రక్తహీనత కారణంగా గోళ్లు బలహీనంగా మారి త్వరగా విరిగిపోతాయి. బీట్‌రూట్, దానిమ్మ, యాపిల్, బచ్చలికూర, మెంతులు, అంజీర్, జామ, అరటిపండు, ఎండుద్రాక్ష మొదలైనవి తినడం వల్ల ఐరన్‌ లోపాన్ని అధిగమించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories