ఫస్ట్ ఇంప్రెషన్‌ బాడీ ల్యాంగ్వేజే

ఫస్ట్ ఇంప్రెషన్‌ బాడీ ల్యాంగ్వేజే
x
Highlights

మన ప్రవర్తించే తీరు బట్టే ఎదుటివారు మనతో ప్రవర్తిస్తారు. ముఖ్యంగా అవతలివారు మన బాడీ ల్యాంగ్వేజ్‌పైనే ఫోకస్ చేస్తారు. కొన్ని పద్దతులు పాటించడం...

మన ప్రవర్తించే తీరు బట్టే ఎదుటివారు మనతో ప్రవర్తిస్తారు. ముఖ్యంగా అవతలివారు మన బాడీ ల్యాంగ్వేజ్‌పైనే ఫోకస్ చేస్తారు. కొన్ని పద్దతులు పాటించడం ద్వారా మన ప్రవర్తన, నిలబడే తీరు, ముఖంలో ఒలికే కవళికలు మనల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. చూడగానే పావ్‌టివ్ ఇంప్రెషన్ కలిగజేస్తాయి అవి ఎంటో ఓ సారి చూద్దా్ం..

ముఖం మీద చిరునవ్వు కనిపిస్తూ ఉండాలి. అప్పుడే ఇతరులు మీతో మాట్లాడడానికి ఆసక్తి చూపుతారు. ముఖకవళికలలో చిరునవ్వు ఉండడటం వల్ల ఎదుటివాళ్లలో మన పట్ల సద్భావన కలుగుతుంది.. అనవసరంగా అరుస్తూ మాట్లాడకూడదు. సందర్భాన్నిబట్టి స్వరం మారుస్తుండాలి. అలాగే మనం నడిచేటప్పుడు భుజాలు వెనక్కి, ఛాతి పైకి ఉండాలి. నిటారుగా నడుస్తుండాలి. అవసరాన్నిబట్టి భావ వ్యక్తీకరణ, చేతులు కదిలించాలి. మీరు వ్యక్తం చేప్పలకున్న విషయాన్ని చేతుల కదలికలు స్పష్టం చేసేలా ఉండాలి. పరిచయం చేసుకునేటప్పుడు సూటిగా కళ్లలోకి చూడాలి. మీరు ఎంత హడావిడిలో ఉన్నా ఆ తొందర మీలో ప్రతిబింబించకూడదు. ఇలాంటి సూత్రాలను పాటించి మీలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడాలే చేసుకోండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories