Gym at Home: ఇంట్లోనే మినీ జిమ్ రెడీ చేసుకోవచ్చు – సులభమైన మార్గాలు!

Gym at Home:  ఇంట్లోనే మినీ జిమ్ రెడీ చేసుకోవచ్చు – సులభమైన మార్గాలు!
x

Gym at Home: ఇంట్లోనే మినీ జిమ్ రెడీ చేసుకోవచ్చు – సులభమైన మార్గాలు!

Highlights

బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే చాలామంది జిమ్‌కి వెళ్లి కష్టపడి వర్కవుట్స్ చేస్తుంటారు. అయితే జిమ్‌కు వెళ్లడం ఇష్టం లేని వాళ్లు, జిమ్‌కి వెళ్ళడానికి టైం లేని వాళ్లు కొందరు ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తారు. అయినా వ్యాయామం చేయాలంటే జిమ్‌కే వెళ్లాలా ? కొన్ని జిమ్ ఎక్విప్‌మెంట్స్‌తో ఇంట్లోనే మినీ జిమ్ రెడీ చేసుకోవచ్చు. అదెలాగంటే..

బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే చాలామంది జిమ్‌కి వెళ్లి కష్టపడి వర్కవుట్స్ చేస్తుంటారు. అయితే జిమ్‌కు వెళ్లడం ఇష్టం లేని వాళ్లు, జిమ్‌కి వెళ్ళడానికి టైం లేని వాళ్లు కొందరు ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తారు. అయినా వ్యాయామం చేయాలంటే జిమ్‌కే వెళ్లాలా ? కొన్ని జిమ్ ఎక్విప్‌మెంట్స్‌తో ఇంట్లోనే మినీ జిమ్ రెడీ చేసుకోవచ్చు. అదెలాగంటే..

కొన్ని పరికరాల ద్వారా మీ ఇంట్లోనే మినీ జిమ్ తయారుచేసుకోవచ్చు. అచ్చం జిమ్‌లాంటి అనుభూతే కావాలనుకుంటే ఒకటి రెండు పొడవాటి అద్దాలు ఆ గదిలో ఏర్పాటు చేసుకుంటే సరి. ఇక పరికరాల విషయానికొస్తే..

ప్లేట్లు, ప్లెయిన్ రాడ్స్

ఇవి కేజీల వారీగా దొరుకుతాయి. రెండు నుంచి ఐదు కేజీల వరకూ కొనుక్కుంటే... అనేక రకాల వ్యాయామాలు చేయొచ్చు. ప్లెయిన్ రాడ్‌కి ఇరువైపులా బరువులు జత చేయాలి. కేవలం రెండు చేతులతో పట్టుకుని కుడి, ఎడమలవైపు వంగే ప్రయత్నం చేసినా చాలు. పొట్టకు ఇరువైపులా ఉండే కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.

ఎక్సర్‌సైజ్‌ బాల్‌

దీంతో కొన్ని ప్రత్యేక కసరత్తులు చేయొచ్చు. బోర్లా పడుకుని చేతులు, కాళ్లను సాగదీయడం, కూర్చుని వెనక్కి వాలి పైకి లేవడం, కాళ్లను పైకి లేపే ప్రయత్నం.. ఇవన్నీ దీనిపై చేసే వ్యాయామాలే. అవి కాక, ఏదైనా పనిచేస్తున్నప్పుడు దీని మీద కూర్చున్నా కొన్ని క్యాలరీలు కరిగించుకోవచ్చు. అవసరంలేదనుకున్నప్పుడు దీనిలోని గాలి తీసేసి పక్కన పెట్టొచ్చు.

రెసిస్టెన్స్‌ బ్యాండ్‌

ఇది బిగుతుగా ఉండే ఎలాస్టిక్ బ్యాండ్. దీంతో చేతులు , కాళ్లకు సంబంధించిన అనేక వ్యాయామాలు చేసుకోవచ్చు. వ్యాయామాన్ని బట్టి అరగంటకు వంద నుంచి రెండు వందల క్యాలరీలు కరిగించుకోవచ్చు. దీనివల్ల శరీరం బాగా సాగుతుంది. ముఖ్యంగా మోకాలు, భుజాలు, మోచేయి దగ్గర కీళ్లు బలపడతాయి. చాలా తక్కువ ఖర్చులో దొరికే వ్యాయామ పరికరం ఇది.

డంబెల్స్‌

బరువులు ఎత్తే వ్యాయామాలు జిమ్‌లో చాలా రకాలే చేస్తుంటారు. వీటి ద్వారా అవన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చు. డంబెల్స్ కేజీలను బట్టి అనేక బరువుల్లో లభిస్తాయి. నలభై నిమిషాలకు దాదాపు వందకు పైగా క్యాలరీలు ఖర్చవుతాయి. దీనివల్ల చేతి కండరాలు బలంగా తయారవుతాయి. చేతులు, ఛాతిభాగం సరైన ఆకృతిలోకి వస్తాయి.

స్కిప్పింగ్‌ రోప్‌

ఇది అందరికీ తెలిసిందే. దీని వల్ల కాళ్లు, భుజాల కండరాలు బలపడటమే కాదు. గుండెకు కూడా మంచి వ్యాయామం అందుతుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీలు కరిగించుకోవచ్చు. ఇరవై నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే దాదాపు రెండొందల క్యాలరీలు ఖర్చయిపోతాయి. దీనిని రోజూ చేస్తుండడం ద్వారా ఎంతో మార్పు కనిపిస్తుంది.

అతి వద్దు

అయితే ఇక్కడొక ప్రమాదం కూడా ఉంది. ఇంట్లోనే జిమ్ ఉందిగా అని అతిగా వ్యాయామం చేస్తుంటారు కొంత మంది. కండలు త్వరగా పెరిగిపోవాలని ఎక్కువ సేపు కసరత్తులు చేయకూడదు.

రోజూ సాధారణంగా 45 నిమిషాల నుంచి ఒక గంటసేపు వ్యాయామం చేస్తే చాలు. దీనికై ఒక ప్రణాళిక ఉండాలి. శరీరం వ్యాయామానికి బాగా అలవాటు పడితే గంటన్నర వరకూ చేయవచ్చు.

ముందుగా 15 నిమిషాలు వామప్‌ చేయాలి. ఈ సమయంలో శరీరం కసరత్తులు చేయడానికి సిద్ధమవుతుంది. కండరాలు, ఎముకలు ఫ్రీ అవుతాయి. తరువాత 30 నుంచి -45 నిమిషాలు కసరత్తు చేయాలి.

కండలు పెంచాలనుకునే వాళ్లు నిపుణుల సలహా మేరకు ఒక ప్రణాళిక ప్రకారం చేయాల్సిన కసరత్తులు, తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుని మొదలు పెట్టడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories