Tan: ఎండ వేళ ముఖంపై ట్యాన్‌ తొలగించే మాస్క్‌.. రోజంతా తాజాదనం గ్యారెంటీ..!

How to Remove Tan at Home with Beetroot and Rice Flour Face Mask Natural Tan Removal Tips
x

Tan: ఎండ వేళ ముఖంపై ట్యాన్‌ తొలగించే మాస్క్‌.. రోజంతా తాజాదనం గ్యారెంటీ..!

Highlights

Tan Removing Mask: ఎండాకాలం ముఖంపై సూర్యుని హానికర కిరణాలు పడితే ముఖంతోపాటు మీ చర్మం కూడా త్వరగా ట్యాన్‌ అవుతుంది.

Tan Removing Mask: ఇంట్లోనే ఎండ వల్ల ఏర్పడిన ట్యాన్‌ తొలగించుకోవచ్చు. ట్యాన్‌ వల్ల ముఖం నల్లగా మారిపోతుంది. రానురాను చర్మం జీవం కోల్పోతుంది. ఈ మండే ఎండలో మీ ముఖం మచ్చ లేకుండా మెరిసిపోవాలంటే ఈ బీట్‌రూట్‌ మాస్క్‌ ట్రై చేయండి.

బీట్‌రూట్‌, బియ్యం పిండి కేవలం ఈ రెండు సహజసిద్ధమైన వస్తువులతో సులభంగా మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. దీనికి వేల రూపాయల ఖర్చు కూడా ఉండదు. బీట్‌రూట్‌, బియ్యం పిండలో ఎక్స్‌ఫోలియేట్‌ గుణాలు ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే డెడ్‌ స్కిన్ సెల్స్‌ తొలగిస్తాయి. అంతేకాదు ముఖంపై అదనంగా ఉత్పత్తి అయ్యే నూనె కూడా గ్రహించేస్తాయి. ఈ రెండిటినీ కలిపి ముఖానికి మాస్క్‌ వేయడం వల్ల ముఖంపై ఉండే నల్లమచ్చలు కూడా తొలగిపోతాయి. బీట్‌రూట్‌, బియ్యం పిండితో ఫేస్‌ మాస్క్‌ ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు..

ఒక బీట్‌రూట్‌, రెండు కప్పుల నీరు, కొద్దిగా పాలపొడి, బియ్యం పిండి తీసుకోవాలి. బీట్‌రూట్‌ మిక్స్‌ చేసి జ్యూస్‌ తీయాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే పాలపొడి, బియ్యం పిండి కలిపి మెత్తని పేస్ట్‌ తయారు చేసుకోవాలి. దీన్ని ముఖంతోపాటు ట్యాన్‌ అయిన ప్రాంతంలో రుద్దాలి. ఓ అరగంట తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్‌ మాస్క్‌ను వారానికి రెండుసార్లు ట్రై చేయండి. దీంతో మీ ముఖం మచ్చ లేకుండా, పూర్తిగా ట్యాన్‌ కూడా తొలగిపోతుంది.

బీట్‌రూట్‌ జ్యూస్‌ కూడా తీసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ఎండాకాలం ఈ జ్యూసులు తీసుకోవడం వల్ల చర్మం హైడ్రేషన్‌గా ఉంటుంది. ప్రధానంగా ఎండలో వెళ్లినప్పుడు ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ తప్పనిసరిగా అప్లై చేయడం మర్చిపోవద్దు. ఇది మన చర్మానికి ఓ షీల్డ్‌లా కాపాడుతుంది. ముఖం ట్యాన్‌ కూడ అవ్వదు. సూర్యుని హానికర యూవీ కిరణాల నుంచి కూడా మన చర్మాన్ని కాపాడుతుంది. దీంతోపాటు ముఖాన్ని ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా కాటన్‌ గుడ్డతో కవర్‌ చేసుకోవాలి. ఇలాంటి టిప్స్‌ పాటిస్తూ చర్మాన్ని కాపాడుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories