డ్రస్స్‌కు అంటుకున్న చూయింగ్ గమ్‌ని చిటికెలో తీసే చిట్కా..

డ్రస్స్‌కు అంటుకున్న చూయింగ్ గమ్‌ని చిటికెలో తీసే చిట్కా..
x
Highlights

చూయింగ్ గమ్ అతుక్కుంటే దాన్ని తీసేయ్యడంలో ఉన్న బాధ, అనుభవించిన వారికే తెలుస్తుంది. తళతళలాడే కారు లేదా బైక్‌కి చూయింగ్‌ గమ్‌ అంటుకుంటే చూడ్డానికి...

చూయింగ్ గమ్ అతుక్కుంటే దాన్ని తీసేయ్యడంలో ఉన్న బాధ, అనుభవించిన వారికే తెలుస్తుంది. తళతళలాడే కారు లేదా బైక్‌కి చూయింగ్‌ గమ్‌ అంటుకుంటే చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది. డ్రస్స్‌లకూ అంటుకుంటే మరీ ఇబ్బందికరంగా ఉంటుంది.

ఈ సమస్యను తీర్చడానికి చక్కటి పరిష్కారం ఉంది.

* పేపర్ తీసుకొని దాంతో ఎంతవరకు తీసేయగలుగుతామో అంతవరకు తొలగించాలి.

* తర్వాత ఒక పొడి బట్ట తీసుకొని కొద్దిగా కిరోసిన్‌ అద్ది దాంతో మరకను రుద్దాలి. ఓ నిమిషంపాటు అలాగే చేస్తే మరక మాయమవుతుంది.

* తర్వాత మరో పొడి బట్టతో శుభ్రంగా తుడిస్తే మీ సమస్య తీరుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories