ఇంట్లో పాములు రాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు – వెంటనే అనుసరించండి!

ఇంట్లో పాములు రాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు – వెంటనే అనుసరించండి!
x

ఇంట్లో పాములు రాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు – వెంటనే అనుసరించండి!

Highlights

వర్షాకాలంలో పాములు ఎక్కువగా ఇళ్లలోకి చొరబడతాయి. వర్షం, వేడుకల నుంచి తప్పించుకోవడం, ఆహారం కోసం ఇవి ఇళ్లలోకి చేరతాయి. కొన్ని వస్తువులు, అలవాట్లు పాములను పరోక్షంగా ఆకర్షిస్తాయి. ఈ కారణాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే, పాములను నివారించవచ్చు.

1. ధాన్యాలు:

బియ్యం, గోధుమ, పప్పు వంటి ధాన్యాలను తెరిచి ఉంచడం వల్ల ఎలుకలు వస్తాయి. ఈ ఎలుకలను వేటాడేందుకు పాములు కూడా ఆ ప్రాంతానికి చేరతాయి. కాబట్టి ధాన్యాలను సురక్షిత కంటైనర్లలో నిల్వ చేయాలి.

2. ఆహార వ్యర్థాలు:

కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, మిగిలిన ఆహారం ఎక్కువసేపు వంటగదిలో ఉంచడం వల్ల చిన్న జంతువులు, ఎలుకలు ఆకర్షితమవుతాయి. వాటి వెంట పాములు కూడా ఇంటికి రావచ్చు. ఆహార వ్యర్థాలను వెంటనే ఫెల్ చేయడం లేదా మూత కట్టిన కంటైనర్లలో నిల్వ చేయడం అవసరం.

3. గుడ్లు, పాల ఉత్పత్తులు:

గుడ్లు, పాలు, పెరుగు లాంటి పదార్థాలను తెరిచి ఉంచడం లేదా వాటి వాసన బయటికి వచ్చేలా చేయడం వల్ల ఎలుకలు వస్తాయి. ఎలుకలతోపాటు, వాటిని వేటాడే పాములు కూడా ఇంటికి చేరతాయి.

4. పెంపుడు జంతువుల ఆహారం:

పిల్లులు, కుక్కలు, పక్షుల కోసం ఉంచే ఆహారాన్ని బయట తెరిచి ఉంచకూడదు. ఇది ఇతర చిన్న జీవులను ఆకర్షిస్తుంది. అవి వచ్చే ప్రాంతంలో పాములు కూడా రావచ్చును.

జాగ్రత్తలు:

ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచండి.

ఆహార పదార్థాలు, వ్యర్థాలను సరిగ్గా నిల్వ చేయండి.

ఎలుకలు, ఇతర చిన్న జీవులు రాకుండా చూసుకోండి.

ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పాములు ఇంట్లోకి రాకుండా నివారించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories