అలా చేస్తే జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చు!

అలా చేస్తే జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చు!
x
Highlights

యువత బాధించే అతి పెద్ద సమస్య జుట్టు రాలిపోవడం. జుట్టు రాలటం స్టార్ట్ అయితే.. ఇక అంతే దాన్ని ఆపడం కష్టమనే అభిప్రాయం యువతలో ఉంది. అందుకే హెయిర్ కోసం...

యువత బాధించే అతి పెద్ద సమస్య జుట్టు రాలిపోవడం. జుట్టు రాలటం స్టార్ట్ అయితే.. ఇక అంతే దాన్ని ఆపడం కష్టమనే అభిప్రాయం యువతలో ఉంది. అందుకే హెయిర్ కోసం ఎన్నో రకాల ఆయిల్స్ వాడుతుంటారు. కొంత మంది జుట్టు విషయంలో చాల జాగ్రత్తగా ఉంటారు. ఎలా ఉన్న రాలే జుట్టు రాలుతుంది. జుట్టు రాలిపోయేందుకు కారణాలు అనేకం ఉండొచ్చు. అయితే దాన్ని తగ్గించుకునే చిట్కాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. జుట్టు రాలిపోయే సమస్యకు బీట్ రూట్ చక్కటి పరిష్కారం చూపిస్తుందంటున్నారు నిపుణులు.

ఏడు లేదా ఎనిమిది బీట్‌రూట్‌ ఆకులను ఉడికించాలి. తరువాత వీటిని ఐదారు గోరింటాకులతో కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు రాసుకుని పావు గంట నుంచి 20 నిమిషాల వరకు అలానే ఉండాలి. తరువాత గోరువెచ్చటి నీళ్లతో జుట్టును శుభ్రం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చు అంటున్నారు నిపుణులు. ఈ చిట్కాలు పాటించడంతో పాటు తినే ఆహారం మీద కూడా శ్రద్ధ పెట్టాలి. అప్పుడే జుట్టు రాలడాన్ని పూర్తిగా ఆపడం సాధ్యమవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories