వడ కర్రీ తయారీ ఎలా?

వడ కర్రీ తయారీ ఎలా?
x
Highlights

రోజూ తినే కూరలు తిని తిని విసుగెత్తిపోయారా..అయితే మీకోసమే వెరైటీ వర కర్రీ. శనగపప్పుతో తయారు చేసిన ఈ వడ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది.

రోజూ తినే కూరలు తిని తిని విసుగెత్తిపోయారా..అయితే మీకోసమే వెరైటీ వడ కర్రీ. శనగపప్పుతో తయారు చేసిన ఈ వడ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా దీనిని ఆస్వాదిస్తారు.

కావాల్సిన పదార్ధాలు:

శనగపప్పు,

♦ వెల్లుల్లి రెబ్బలు,

♦ ఎండుమిర్చి,

♦ సోంపు,

♦ ఉల్లిగడ్డ,

♦ టమాటాలు,

♦ పచ్చిమిర్చి,

♦ కరివేపాకు,

♦ అల్లంవెల్లుల్లి పేస్ట్,

♦ ఉప్పు,

♦ నూనె,

♦ కొబ్బరి తురుము,

♦ దనియాల పొడి,

♦ కారం,

♦ గరం మసాలా,

♦ పసుపు,

♦ బిర్యానీ ఆకు,

♦ దాల్చీని,

♦ లవంగం,

♦ యాలాకులు

తయారీ విధానం:

వడ కూర కోసం ముందుగా శనగపప్పును రెండు గంటల పాటు నీటిలో నాబబెట్టుకోవాలి..అలా నానబెట్టుకున్న శనగపప్పును మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. పిండిని గిన్నెలోనికి తీసుకోవాలి..ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. వడలు తయారీకి సరిపడినంత నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తరువాత మీడియమ్ ఫ్లేమ్ పెట్టుకుని వడలు చేసుకుని నూనెలో వేసి డీప్‌ ఫ్రై చేయాలి...ఇలా డీప్ ఫ్రై చేసిన వడలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె కడాయి తీసేసి మరో కడాయి స్టవ్ మీద పెట్టుకోవాలి.

ఇందులో నూనె పోసి కాస్త కాగాక బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చీని చెక్క వేసుకోవాలి...ఇప్పుడు కట్‌ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి. వీటిని దోరగా వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలతో పాటు కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే అల్లవెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, దనియాల పొడి, కారం వేసుకోవాలి.పచ్చివాసన పోయేంత వరకు వీటిని సిమ్‌లో వేపుకోవాలి. ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాట ముక్కలను వేసుకోవాలి. వీటిని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కూర కోసం కాస్త వాటర్ ను యాడ్ చేసుకోవాలి.

5 నుంచి 10 నిమిషాల పాటు కాస్త కూరను మగ్గనివ్వాలి. వడలో ఆల్‌రెడీ ఉప్పు వేసుకుంటాం కాబట్టి కూరలో కాస్త ఉప్పు చూసుకుని వేసుకోవాలి. ఆల్‌రెడీ గ్రైండ్ చేసి పెట్టుకుని కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వడలను వేసుకుందాం... సిమ్‌లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. వడ కర్రీ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories