ఆరోగ్యానికి రుచికరమైన 'పుట్టగొడుగుల వేపుడు'.. తయారీ ఎలా?

ఆరోగ్యానికి రుచికరమైన పుట్టగొడుగుల వేపుడు.. తయారీ ఎలా?
x
Highlights

నాన్‌వెజ్ తినని వారికి ఆ స్థాయిలో పోషకాలను అందించే మంచి ఆహారం మష్‌రూమ్స్ వాటినే పుట్టగొడుగులు అని కూడా అంటారు.

నాన్‌వెజ్ తినని వారికి ఆ స్థాయిలో పోషకాలను అందించే మంచి ఆహారం మష్‌రూమ్స్ వాటినే పుట్టగొడుగులు అని కూడా అంటారు. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. తరచుగా మష్‌రూమ్స్ తినడం వల్ల శరీరానికి సరిపడే విటమిన్ డి అందుతుందని వైధ్యులు వెల్లడించారు. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాక విటమిన్ బి, రైబోఫ్లేవిన్, నియాసిన్ వంటి పోషకాలు సముపాళ్ళలో అందుతాయి. అంతేకాకుండా పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందడంతో పాటు చర్మం కోమలంగా మారుతుంది. మధుమేహాన్ని తగ్గించే ఇన్సులిన్ వీటిల్లో ఉంటుంది. అందుకని షుగర్‌ పేషంట్స్ మష్‌రూమ్స్ భయపడకుండా తినవచ్చు. వీటిలో క్యాలరీల శాతం తక్కువ కాబట్టి హార్ట్‌ పేషంట్స్‌కు కూడా ఇది సురక్షితమైన ఆహారం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కావాల్సిన పదార్ధాలు:

పుట్టగొడుగులు- 250 గ్రాములు

♦ జీడిపప్పు-20 పలుకులు

♦ ఉల్లిగడ్డ - ఒకటి

♦ టమోట-ఒకటి

♦ అల్లంవెల్లుల్లి పేస్ట్‌ -టీస్పూన్

♦ మిర్చి-ఒకటి

♦ కారం- అర టీస్పూన్

♦ పసుపు- చిటికెడు

♦ కరివేపాకు- రెండు రెమ్మలు

♦ ఆవాలు- పాలు టీస్పూల్

♦ జీలకర్ర- అరటీస్పూన్

♦ నూనె- తగినంత

♦ గరంమసాలా- టీస్పూన్

♦ ఉప్పు- సరిపడినంత

తయారీ విధానం:

కావాల్సిన పదార్ధాలన్నీ సిద్ధం చేసుకున్న తరువాత ముందుగా ఉల్లిపాయలను , పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా కాసేపు నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో నూనె పోసి కాస్త వేడి చేయాలి. నూనె వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.

పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలను వేయాలి. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగాక టమాట ముక్కలు వేసి మరికాసేపు వేగనివ్వాలి. టమాట ముక్కలు మగ్గిన తరువాత... పసుపు, కారం, గరంమసాలా, కరివేపాకు వేసి వేగించాలి. ఇప్పుడు ముందే కడిగి పెట్టుకున్న పుట్టగొడుగులను , నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పును కడాయిలో వేయాలి.. తరువాత రుచికి తగినంత ఉప్పు వేసి కలితిప్పాలి. లో ఫ్లేమ్‌లోనే మష్‌రూమ్స్ ను ఫ్రై చేసుకోవాలి. కొంచెం పులుపుగా కూడా కావాలనుకుంటే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. పుట్టగొడుగులు మంచి కలర్ వచ్చిన తరువాత దింపాలి. మష్‌రూమ్స్ ఫ్రై చపాతీలోకి అలాగే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories