నోరూరించే గులాబ్ జామూన్‌ తయారీ ఎలా?

నోరూరించే గులాబ్ జామూన్‌ తయారీ ఎలా?
x
Highlights

పండగొచ్చినా..పబ్బమైనా..ఇంటికి చుట్టం వచ్చినా మంచి శుభవార్త విన్నా అందరూ తీపి కబురును సెలబ్రేట్ చేసుకునేందుకు స్వీట్స్‌ని పంచుకోవడం మన తెలుగువారి సాంప్రదాయం.

పండగొచ్చినా..పబ్బమైనా..ఇంటికి చుట్టం వచ్చినా మంచి శుభవార్త విన్నా అందరూ తీపి కబురును సెలబ్రేట్ చేసుకునేందుకు స్వీట్స్‌ని పంచుకోవడం మన తెలుగువారి సాంప్రదాయం. అందుకే లెక్కకు రాని స్వీట్ వెరైటీలు మనల్ని నోరూరిస్తుంటాయి..అందులో అందరూ మెచ్చే అందరికి నచ్చేది గులాబ్ జామూన్ చూడడానికి గోధుమ రంగులోఉన్నా...దాన్ని నోట్లే వేసుకుంటే అంతే సంగతులు...లోకాన్ని మరిచిపోవాల్సిందే...మరి ఈ గులాబ్ జామూన్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..పదండి.

కావాల్సిన పదార్ధాలు:

గులాబ్ జామూన్ ప్యాకెట్ - ఒకటి

♦ షుగర్ - అరకిలో

♦ యాలాకుల పొడి-అరటీస్పూన్

♦ నూనె - పావుకిలో

♦ నీళ్లు - రెండు కప్పులు

♦ పన్నీర్ -కప్పు

♦ జీడిపప్పులు- కావల్సినన్ని

తయారీ విధానం:

గులాబ్ జామూన్ ప్యాకెట్‌ను కట్ చేసుకుని పొడిని ఒక కప్పులో వేసుకోవాలి. కాస్త నీరు పోసి పిండిని ముద్దలా చేసుకోవాలి. ఇందులోనే పన్నీర్‌ను వేసుకోవాలి...కావాలనుకుంటే పాలతో కూడా ముద్దలు చేసుకోవాచ్చు. పన్నీర్ వేసుకోవడం వల్ల గులాబ్ జామూన్‌లు మృదువుగా వస్తాయి...ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.పక్కన పెట్టుకునే ముందు జీడిపప్పులను ఉండలకు అతికించుకోవాలి..ఇలా చేయడం వల్ల జామూన్‌లకు ఎక్స్‌ట్రా ఫ్లేవర్ వస్తుంది. ఈ సమయంలో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో నూనె వేయాలి. నూనె బాగా కాగే వరకు వేడిచేసుకోవాలి...అదే సమయంలో స్టవ్ వెలిగించి పాకానికి సరిపోయేంత గిన్నె పెట్టుకుని అందులో చెక్కర వేయాలి...కొద్దిగా నీరు పోసి పాకం తయారు చేసుకోవాలి..గులాబ్ జామూన్‌కు లేత పాకమే బాగుంటుంది.... ఇప్పుడు

నూనె కాగిన తరువాత మీడియం ఫ్లేం పెట్టుకోవాలి..ఇప్పుడు పిండి మిశ్రమాన్ని తీసుకుని చిన్న చిన్న ఉండలు చుట్టాలి. అన్నీ చుట్టిన తరువాత వాటిని నూనెలో వేసుకుని దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన ఉండలను తీసి పాకంలో వేసుకోవాలి. వేడి పాకంలో వేసుకుంటే మంచిగా గులాబ్ జామూన్‌లు మెత్తగా వస్తాయి..అంతే 10 నిమిషాల పాటు ఇలా ఉంచిచే చాలు వేడి వేడి గులాబ్ జామూన్‌లు రెడీ అవుతాయి.. గులాబ్ జామూన్‌లను వేడిగా తినవచ్చే లేదా కోల్డ్‌గా కూడా తినవచ్చు..కావాలనుకుంటే ఐక్‌క్రీంతో కలిపి తిన్నా...దాని టేస్టే...సుపర్బ్‌...



Show Full Article
Print Article
More On
Next Story
More Stories