దమ్ అలూ ఎలా తయారు చేస్తారో తెలుసా?

దమ్ అలూ ఎలా తయారు చేస్తారో తెలుసా?
x
Highlights

బంగాళదుంపు అందరికీ ఆల్‌టైమ్‌ ఫేవరేట్ ఫుడ్. శరీరానికి కావాల్సిన పోషకాలు పొందడానికి ఆలూ ఎంతగానో తోడప్పుతుంది.

బంగాళదుంపు అందరికీ ఆల్‌టైమ్‌ ఫేవరేట్ ఫుడ్. శరీరానికి కావాల్సిన పోషకాలు పొందడానికి ఆలూ ఎంతగానో తోడప్పుతుంది. ఆలూ ఫ్రై చేసినా... కూర వండుకున్నా దాని టేస్ట్‌కి అందరూ ఫిదా అవ్వాల్సిందే.. అలూతో తయారయ్యే ఎన్నో వంటకాలు ఉన్నాయి.. వివిధ రకాల మసాలతో విభిన్న రుచుల్లో దీనిని వండుకోవచ్చు. మరి భారతీయ వంటల్లో ఎంతో ఫేమస్ అయ్యింది దమ్ ఆలూ . దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు . ఇది పంజాబీస్ రెసిపీ . చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో, చపాతీల్లో , పరోటాలో మంచి కాంబినేషన్ గ్రేవీ కర్రీ మరి దమ్ అలూ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం పదండి.

కావాల్సిన పదార్ధాలు

ఆలూ

♦ ఉల్లిపాయలు

♦ బిర్యానీ ఆకు

♦ పెరుగు

♦ పసుపు

♦ అల్లంవెల్లుల్లి పేస్ట్

♦ లవంగాలు

♦ జీలకర్ర

యాలాకులు

♦ చక్కెర

♦ కారం

♦ ఇంగువ

♦ ధనియాలు

♦ దాల్చీని

♦ జీడిపప్పు

♦ కసూరి మేంతి

♦ నూనె

♦ కొత్తిమీర

♦ ఉప్పు

తయారీ విధానం:

ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను చిన్నవి తీసుకోవాలి..వాటిని తొక్కుతీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులో నూనె వేసుకోవాల.నూనె కాగిన తరువాత ఇప్పుడు బంగాళదుంపలను వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఆలూను ఫ్రై చేసుకోవాలి..ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. అలా చేస్తే ఆలూ మొత్తం ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన ఆలూ ముక్కలను ప్లేట్‌లోకి తీసుకోవాలి...

దమ్ ఆలూకు మసాలా కరెక్ట్ గా సెట్ అవ్వాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది..ఇప్పుడు మరి మసాలాను తయారు చేసుకుందాం...ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో టేబుల్ స్పూన్ దనియాలు, అరటేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక యాలాకు, దాల్చీని చెక్క, నాలుగు లవంగాలు , జీడిపప్పులను వేసుకోవాలి... వీటన్నింటిని మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి..అందులో కాస్త నూనె పోసుకోవాలి...నూనె బాగా కాగాక చిటికెడు ఇంగువ వేసుకోవాల.ఇప్పుడు బగారా ఆకు, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుని బాగా వేగనివ్వాలి. లైట్‌ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాల పొడిని ఇందులో వేసుకోవాలి.. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు గ్రేవీ క్వాంటిటీని బట్టి పెరుగు వేసుకోవాలి..ఇందులో మూడు కప్పుల పెరుగు వేసుకోవచ్చు..ఇప్పుడు మెళ్లిగా కలుపుకోవాలి.. తరువాత పసుపు, కారం వేసుకోవాలి.. బాగా కలుపుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి..ఇప్పుడు ఉడికించి వేయించి పెట్టుకున్న ఆలూ ముక్కలను ఇందులో వేసుకోవాలి

ఇప్పుడు కసూరీ మేంతీ ని పొడి చేసుకుని ఇందులో వేసుకోవాలి. తరువాత రుచికిసరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా కలపాలి. ఇప్పుడు కాస్త నీరు పోసుకుని ఉడికించాలి. గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించాలి.. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి... అంతే వేడి వేడి దమ్ అలూ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories