గుమ గుమలాడే చికెన్ మంచూరియా తయారీ ఇలా...

గుమ గుమలాడే చికెన్ మంచూరియా తయారీ ఇలా...
x
Highlights

శీతాకాలంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. మంచు ప్రభావంతో పాటు చల్లటి వాతావరణం వల్ల చాలా మంది వేడివేడి పదార్ధాలను ఆరగించేందకు ఇష్టపడుతుంటారు.

శీతాకాలంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. మంచు ప్రభావంతో పాటు చల్లటి వాతావరణం వల్ల చాలా మంది వేడివేడి పదార్ధాలను ఆరగించేందకు ఇష్టపడుతుంటారు. అందులోనూ స్పైసీగా టేస్టీగా నాన్‌వెజ్‌ను లాగించాలనుకునే వారి శాతం ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో చికెన్‌ను తినేందుకు మక్కువను కనబరుస్తారు. చికెన్ ఒంట్లో వేడిని పెంచుతుందని నమ్ముతారు. అంతే కాదు చాలా మందికి చికెన్‌లోని ఆరోగ్యా ఉపయోగాలు తెలీదు. అవి గనుక తెలిస్తే దానిని తినకుండా ఉండలేరంటున్నారు నిపుణులు. చికెన్ మన ఒంట్లోని చెబు కొవ్వును కరిగిస్తుందని, అధిక బరువును తగ్గిస్తుందని చెబుతుంటారు. చికెన్‌లోని పోషకాలు శరీరానికి కావాల్సినంత శక్తిని అందిస్తాయి. చికెన్‌ను రోజూ తీసుకుంటే మంచిది కాదు కానీ... వారంలో రెండు సార్లు మంచి ఫలితం ఉంటుందట.

కావాల్సిన పదార్ధాలు:

చికెన్‌ : 300 గ్రాములు

♦ క్యాప్సికమ్‌ : ఒకటి

♦ ఉల్లిగడ్డ : ఒకటి

♦ పచ్చిమిర్చి : నాలుగు

♦ వెల్లుల్లి : నాలుగు

♦ మైదా : రెండు టేబుల్ స్పూన్‌లు

♦ కారం : సరిపడినంత

♦ కశ్మీరీ కారం : సరిపడినంత

♦ కార్న్‌ఫ్లోర్‌ : రెండు టేబుల్ స్పూన్‌లు

♦ ఉప్పు : సరిపడినంత

♦ నూనె : ఒక కప్పు

♦ టమోటా సాస్‌ : టేబుల్ స్పూన్

♦ సోయాసాస్‌ : టేబుల్ స్పూన్

♦ చిల్లీ సాస్‌ : టేబుల్ స్పూన్

తయారీ విధానం:

ముందుగా చికెన్‌ను బాగా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. తరువాత చికెన్‌లో రెండు టేబుల్‌స్పూన్‌ల మైదా వేసుకుని బాగు కలుపుకోవాలి. ఇప్పుడు మంచి కలర్‌కోసం మనం కశ్మీరీ కారాన్ని వినియోగిస్తున్నాము..స్పైస్‌గా తినేవారు దీనిని వేసుకోవచ్చు. చికెన్ మంచురీయాలో అల్లం పేస్ట్ వేసుకోవడం లేదు..మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇందులోనే టేబుల్ స్పూన్ నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకుందాం. ఉప్పు కూడా వేసుకుని చికెన్‌ను కలపాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ను ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచుకోవాలి..చికెన్ తో చేసే ఏ రెసిపీ అయినా సరే మ్యారినేట్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది.

రెండు టేబుల్‌స్పూన్‌ల కార్న్‌ఫ్లోర్‌ ను నీటిలో కలుపుకుని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకోవాలి. ఇందులో చికెన్ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నూనెలో బాగా వేగిని చికెన్ పీస్‌లను వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే కడాయిలో వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలను , పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డలను బాగా వేపుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్‌ ముక్కలను వేసుకోవాలి. సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమోట, చిల్లీ, సోయా సాస్‌లను వేసుకుని బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి...వేడి వేడి చికెన్ మంచూరియా రెడీ.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories