ఆరోగ్యకరమైన వెజ్ సూప్ ఎలా తయారు చేసుకోవాలంటే

ఆరోగ్యకరమైన వెజ్ సూప్ ఎలా తయారు చేసుకోవాలంటే
x
Vegetable Soup
Highlights

మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది..పోషకాలు కలిగిన ఆహారం నిత్యం తీసుకోవడం వల్ల శరీరదారుఢ్యంపెరిగి ఆరోగ్యవంగంగా కలకాలం జీవించవచ్చు.

మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది..పోషకాలు కలిగిన ఆహారం నిత్యం తీసుకోవడం వల్ల శరీరదారుఢ్యంపెరిగి ఆరోగ్యవంగంగా కలకాలం జీవించవచ్చు. ఆరోగ్యంపై ఆహార ప్రభావం అధికంగా ఉంటుంది. సమపాళ్లలో కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటేనే అన్ని రకాల పోషకాలు మనకు అందుతాయి. కానీ ఈ కాలంలో చాలా మంది చాలా వరకు కూరగాయలు తినేందుకు ఇష్టపడరు.. ఫాస్ట్‌ఫుడ్‌కు ఇచ్చినంత ప్రియారిటి పోషకాలు కలిగిన ఆహారానికి ఇవ్వరు. అలాంటి వారికి మరి ఈ పోషకాలు అందడం ఎలా.. అంటే.. వారు తిసూకునే విధంగా ఆహారాన్ని అందిస్తే సరిపోతుంది.. రుచిగా, ఆరోగ్యకరమైన వెజ్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి..

కావాల్సిన పదార్ధాలు :

అల్లం

♦ వెల్లుల్లి

♦ పచ్చిమిర్చి

♦ కొత్తిమీర

♦ బీన్స్

♦ క్యారెట్స్‌

♦ క్యాప్సికం

♦ మష్‌రూమ్స్

♦ ఉల్లి కాడలు

♦ పెప్పర్

♦ సోయా సాస్‌

♦ కార్న్‌ ఫ్లోర్

♦ ఉప్పు

♦ నూనె

తయారీ విధానం :

ముందుగా కూరగాయలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. నూనె వేసుకోవాలి. నూనె కాస్త కాగాక ఇందులో మొదటగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసుకోవాలి.. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి స్పైసీ కోరుకునే వారు రెండు లేదా మూడు వేసుకోవచ్చు.. వాటిని సన్నగా తరిగి పాన్‌లో వేసుకోవాలి ఇందులోనే టీస్పూన్ మిరియాల పొడి చల్లుకోవాలి...

ఇప్పుడు కట్‌ చేసి పెట్టుకున్న బీన్స్‌ , క్యారెట్, క్యాప్సికం, మష్‌రూమ్స్‌, కొత్తిమీర ముక్కలను ఇందులో వేసుకోవాలి. వీటన్నింటిని కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముక్కలను బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేబుల్ స్పూన్ సోయా సాస్‌ వేసుకోవాలి. కాసేపయ్యాక నీళ్లు పోసుకోవాలి. వీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలోనే నాలుగు టేబుల్ స్పూన్ ల కార్న్‌ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.. ఇప్పడు తరిగిన ఉల్లి కాడలను పైన చల్లుకోవాలి..అంతె వెజిటేబుల్ సూప్ రెడీ.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories