మునక్కాయలతో టేస్టీ మటన్ కర్రీ తయారీ ఎలా?

మునక్కాయలతో టేస్టీ మటన్ కర్రీ తయారీ ఎలా?
x
Highlights

సాధారణంగా మునక్కాయ అంటే ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. అయితే వారిలో కొందరికి మునక్కాయ సాంబార్ అంటే ఇష్టం ఉండొచ్చు.

సాధారణంగా మునక్కాయ అంటే ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. అయితే వారిలో కొందరికి మునక్కాయ సాంబార్ అంటే ఇష్టం ఉండొచ్చు.. కొందరికి కూర అంటే ఇష్టం ఉండొచ్చు. మునక్కాయ కేవలం రుచికోసమే కాదు.. దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కూడా తింటారు. మునక్కాయలోని విటమిన్లు, ఐరన్, కాల్షియంలు ఎముకల బలానికి ఎంతగానో తోడ్పడతాయి. మునగలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని ఇన్‌ఫెక్షన్స్ తొలగిస్తాయి.. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మరి ఈ మునక్కాయలతో టేస్టీ మటన్ కర్రీ తింటే ఇంకెలా ఉంటుంది.. అసలీ రెసిపీ ఎలా తయారు చేయాలి.. చూద్దాం.. పదండి.

కావాల్సిన పదార్ధాలు:

మటన్

♦ మునక్కాయలు

♦ ఉల్లిపాయలు

♦ టమోట

♦ పసుపు

♦ కారం

♦ నూనె

♦ కరివేపాకు

♦ వెల్లుల్లి

♦ అల్లం

♦ పచ్చిమిర్చి

♦ ధనియాల పొడి

♦ నిమ్మరసం

♦ కొత్తిమీర

♦ ఉప్పు

స్టవ్ ఆన్ చేసి పొయ్యిమీద కడాయి పెట్టాలి. అందులో నూనె పోసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత ఇందులో ఎండుమిర్చి, వేసుకోవాలి.. వీటితో పాటే కరివేపాకు వేయాలి.

వీటిని బాగా వేపుకోవాలి.. ఎర్రగా వేగాక ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నక్కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మటన్ కాబట్టి ఉడకడానికి కాస్త సమయం పడుతుంది...5 నిమిషాల తరువాత ముక్కలు బాగా ఉడుకుతాయి.

ఇప్పుడు ఇందులోనే అల్లం, వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి.. బాగా కలుపుకోవాలి.. కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టును ముందుగానే వేసుకోవాలి... ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కలు, ఉప్పు వేసుకుందాం. బాగా కలుపుకుని కాసేపు మూత పెట్టుకోవాలి..ఇప్పుడు మూత తీసి కారం, పసుపు, వేసుకోవాలి... బాగా కలుపుకున్నాక నీళ్లు పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో కూరను బాగా కలుపుతూ ఉండాలి. నీరు బాగా ఇంకేంత వరకు కూరను ఉడికించుకోవాలి...చివర్లో ధనియాలపొడి, నిమ్మరసం, కొత్తిమీర వేసుకోవాలి.. అందే వేడి వేడి మునక్కాయ మాంసం కర్రీ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories