టేస్టీ ఫ్రైడ్ చికెన్‌ను ఇం‌ట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు

టేస్టీ ఫ్రైడ్ చికెన్‌ను ఇం‌ట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు
x
Highlights

కేఎఫ్‌సీ చికెన్ అదేనండి ఫ్రైడ్ చికెన్ అంటే ఎవ్వరూ గుర్తుపట్టరు..కానీ కెఎఫ్‌సీ చికెన్ అంటే చాలు అందరి నోర్లు ఊరుతాయి. చిన్నా లేదు పెద్దా లేదూ ఈ...

కేఎఫ్‌సీ చికెన్ అదేనండి ఫ్రైడ్ చికెన్ అంటే ఎవ్వరూ గుర్తుపట్టరు..కానీ కెఎఫ్‌సీ చికెన్ అంటే చాలు అందరి నోర్లు ఊరుతాయి. చిన్నా లేదు పెద్దా లేదూ ఈ మధ్యకాలంలో అందరూ ఈ ఫ్రైడ్ చికెన్‌లకే ప్రియారిటీ ఇస్తున్నారు. మరి టేస్టీ ఫ్రైడ్ చికెన్‌ను మనం ఇం‌ట్లోనే చేసుకోవచ్చు. అది ఎంతో టేస్టీగా మరి ఇంకెందుకు ఆలస్యం దీని ప్రాసెస్ ఏంటో తెలుసకుందాం పదండి.

కావాల్సిన పదార్ధాలు :

*చికెన్ లెగ్‌ పీసులు

*బ్రెడ్ స్లైస్‌లు

*గుడ్డు

*పాలు

*పెప్పర్ పౌడర్

*కార్న్ ఫ్లోర్

*నూనె

*కారం

*ఉప్పు

తయారీ విధానం :

ముందుగా చికెన్ లెగ్ పీసులను తీసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్‌ల కారం వేసుకోవాలి. లెగ్‌ పీస్‌లకు బాగా పట్టించాలి. .చేతులతోనే బాగా కలుపుకోవాలి..ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది.

ఇప్పుడు 4 బ్రెడ్‌ స్లైస్‌లను తీసుకోవాలి..వాటిని మిక్సీ జార్ లో వేసుకోవాలి. వాటిని పొడి చేసుకుని బౌల్‌లోకి తీసుకోవాలి..బ్రెడ్ క్రంబ్స్ లా కనిపించే విధంగా పిండి ఆడుకోవాలి..

ఇప్పుడు మరో బౌల్‌లో కోడిగుడ్డును బీట్చ చేసకోవాలి. ఇందులో ఒక కప్పు పాలను యాడ్ చేయాలి..పాలను వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్‌ను వస్తుంది. కోడిగుడ్డ పాలల్లో కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి..ఇందులోనే ఉప్పు వేసుకోవాలి..కాస్త మిరియాల పొడి టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ..స్పైసీ నెస్ కోసం ఇవన్నీ కలుపుకోవాలి.

ఇప్పుడు మూడు బౌల్స్ ను పక్కన పెట్టుకుని ముందుగా ఉప్పుకారం కలిపిన చికెన్ తీసుకుని కార్న్ ఫ్లోర్‌ పట్టించాలి. తరువాత ఎగ్ మిక్చర్‌లో డిప్ చేసుకోవాలి. తరువాత బ్రెడ్ క్రంబ్స్ ఫుల్ గా పట్టించాలి ఇలా అన్ని పీస్‌లను డిప్ చేసుకోవాలి..ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి..

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి..నూనె వేడయ్యాక ఒక్కొక్క పీస్‌ను డీప్ ఫ్రై చేసుకోవాలి..ఇవి ఫ్రై కావడానికి సమయం పడుతుంది. మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో చికెన్‌ను కుక్ చేసుకోవాలి. అంతే హాట్ అండ్ క్రిస్పీ కేఎఫ్ చికెన్ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories