ఆరోగ్యవంతమైన మొక్కజొన్న వడలు తయారీ ఎలా?

ఆరోగ్యవంతమైన మొక్కజొన్న వడలు తయారీ ఎలా?
x
Highlights

మొక్కజొన్నలను నూనెలు, మసలాలు లేకుండా విభిన్న రకాల్లో తీసుకోవచ్చు. ఒక కప్పు మొక్కజొన్న గింజలతో లభించే క్యాలరీస్‌133 గ్రా. ఇక కార్బొహైడ్రేట్స్‌ 30.8...

మొక్కజొన్నలను నూనెలు, మసలాలు లేకుండా విభిన్న రకాల్లో తీసుకోవచ్చు. ఒక కప్పు మొక్కజొన్న గింజలతో లభించే క్యాలరీస్‌133 గ్రా. ఇక కార్బొహైడ్రేట్స్‌ 30.8 గ్రా., కొవ్వు 1.5 గ్రా., ప్రొటీన్‌ 4.9 గ్రా. లభిస్తాయి. అంతేకాక విటమిన్‌ 173.8 గ్రా., పొటాషియం 329మి.గ్రా., కాల్షియం 24.6మి.గ్రా. అందుతుంది. మెగ్నీషియం 24.6 మి.గ్రా, సోడియం 489 మి.గ్రా, నీరు 126 గ్రా. లభిస్తుంది. అందుకే మొక్కజొన్నలకు ఆహారంలో తగినంత ప్రాధాన్యతనివ్వాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

కావలసిన పదార్థాలు:

మొక్కజొన్న పొత్తులు – 2

ఉల్లిపాయ – 1

పచ్చిమిర్చి – 4

కొత్తిమీర – కొద్దిగా

కరివేపాకు – కొద్దిగా

అల్లం – చిన్న ముక్క

జీలకర్ర – స్పూన్

ఉప్పు – సగినంత

నూనె – సరిపడా

శెనగపిండి – 2 స్పూన్స్

కార్న్‌ఫోర్ – 2 స్పూన్స్

తయారీ విధానం:

ముందుగా మొక్కజొన్న గింజలను ఒలిచి పెట్టుకోవాలి. ఆపై వీటిలో ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముఖ్యంగా గ్రైండ్ చేసేప్పుడు నీరు వాడకూడదు. ఈ మిశ్రమంలో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి కార్న్‌ఫ్లోర్ జతచేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ గింజలు లేతగా ఉంటే.. శెనగపిండి కలుపుకోవచ్చు. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా ఒత్తుకుని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే… వేడివేడి మొక్కజొన్న వడలు రెడీ ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories