స్వీట్ కార్న్ పలావ్ తయారీ ఎలా..

స్వీట్ కార్న్ పలావ్ తయారీ ఎలా..
x
Highlights

ఇప్పుడు ఆహార పదార్ధాలకు సీజన్ అంటూ లేదు 365 రోజులు అన్ని రకాల కూరగాయలు , పండ్లు లభిస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు ఆహార పదార్ధాలకు సీజన్ అంటూ లేదు 365 రోజులు అన్ని రకాల కూరగాయలు , పండ్లు లభిస్తూనే ఉన్నాయి... ముఖ్యంగా స్వీట్‌ కర్న్ .. ఈ కార్న్ ను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. రుచితో పాటు స్వీట్ కార్న్ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. వీటిల్లో పీచు, విటమిన్స్ , యాంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో క్యాలరీలు తక్కువ..అందుకే పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా స్వీట్‌ కార్న్ లాగించేస్తుంటారు. మరి ఈ స్వీట్‌కార్న్‌ తో సింపుల్ గా కార్న్ పలావ్ ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం... లంచ్ బాక్స్‌కు ఇది మంచి డిష్. పిల్లలూ ఎంతో ఇష్టపడతారు.

కావాల్సిన పదార్ధాలు:

స్వీట్ కార్న్ : ఒక కప్పు

♦ పచ్చిమిర్చి: రెండు

♦ లవంగాలు

♦ యాలాకులు

♦ దాల్చీనీ

♦ బాస్మాతీ రైస్ : ఒక కప్పు

♦ ఉల్లిగడ్డలు : రెండు

♦ కొబ్బరి పాలు

♦ కొత్తిమీర

♦ స్టార్ పువ్వు

♦ జీలకర్ర

తయారీ విధానం...

ముందుగా కప్పు బాస్మతీ బియ్యాన్ని 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి...ఇప్పుడు ప్రెజర్ కుక్కర్‌ను తీసుకుని అందులో కప్పు కార్న్ వేసి అర గ్లాసు నీరు పోయాలి...రెండు విజిల్స్ వచ్చే వరకు కార్న్‌ను ఉడికించుకోవాలి. స్వీట్‌ కార్న్ కాబట్టి ఉప్పు వేసుకోవడం లేదు...కావాలనుకునే వారు వేసుకోవచ్చు. కార్న్ ఉడికిన తరువాత వేరే పాత్రలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. పులావ్‌ను కూడా ప్రెజర్ కుక్కర్‌లోనే కుక్ చేసుకుందాం..స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి..అందులో రెండు టేబుల్ స్పూన్‌ల వెయ్యి వేసుకోవాలి...నెయ్యి తినని వారు నూనె కూడా వాడుకోవచ్చు..నెయ్యి కాస్త వేడెక్కాక దాల్చీని, లవంగాలు, యాలాకులు, ఇంకా స్టార్ పువ్వు వేసుకోవాలి.. ఇప్పుడు టీ స్పూన్ జీలకర్ర వసుకుని కాస్త వేపుకోవాలి.

మసాలాలు ఫ్రై అయిన తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిగడ్డల ముక్కలు వేసుకోవాలి, వీటితో పాటే పచ్చిమిర్చి వేసుకోవాలి..ఉల్లిపాయలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేంత రవకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కార్న్ ముక్కలను నీరు లేకుండా తీసుకుని కుక్కర్‌ లో వేసుకోవాలి.

ఇప్పుడు ఆల్‌రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి బియ్యం విరగకుండా మెల్లిగా కలుపుతుండాలి. బియ్యం, కార్న్ బాగా కలిసేలా చూసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలను వేసుకోవాలి. ఒకకప్పు బాస్మతి రైస్ కి ఒకటిన్నర కప్పు కొబ్బరి పాలు పోసుకోవాలి. కొబ్బరి పాలు వద్దనుకునేవారు.. నీరు పోసుకోవచ్చు.. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం..

ఇప్పుడు కుక్కర్ మూత బిగించి కాసేపు ఆవిరి పట్టాలి. తరువాత విజిల్ పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి...అంతే వేడి వేడి కార్న్ పులావ్ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories