స్వీట్ కార్న్‌ బిర్యానీ తయారీ ఎలా?

స్వీట్ కార్న్‌ బిర్యానీ తయారీ ఎలా?
x
Highlights

ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన వాటిలో స్వీట్ కార్న్ ఒకటి . ఒక కప్పు స్వీట్ కార్న్ లో 342 క్యాలరీలు ఉంటాయి. హెమరాయిడ్స్...

ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన వాటిలో స్వీట్ కార్న్ ఒకటి . ఒక కప్పు స్వీట్ కార్న్ లో 342 క్యాలరీలు ఉంటాయి. హెమరాయిడ్స్ మరియు క్యాన్సర్ ను నిరోధిస్తుంది ఈ స్వీట్ కార్న్. స్వీట్‌ కార్న్‌లో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. లోకొలెస్ట్రాల్ లెవల్ కు సహాయపడుతుంది. యాంటియాక్సిడెంట్స్ విటమిన్స్ అధికంగా ఇందులో ఉన్నాయి. విటమిన్ బి, నియాసిన్ మరియు థైమిన్ లు ఉన్నాయి. ఇందులో ఉన్న మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ మరియు సెలీనియం వంటివి మన శరీరంలోని అనేక జీవక్రియలు బాగా పనిచేయడానికి ఉపయోగడతాయి.

కావలసిన పదార్ధాలు :

స్వీట్‌కార్న్

పుదీనా

కొత్తిమీర

బీన్స్

క్యారెట్

బిర్యానీ మసాలా

నూనె

బిర్యానీ ఆకు

యాలకులు

లవంగాలు

దాల్చీని

రెండు పచ్చిమిర్చి

రెండు టమాటాలు

రెండుఉల్లిగడ్డలు

అల్లవెల్లుల్లి పేస్ట్

ఉప్పు.

బాస్మతీ రైస్

తయారీ విధానం

ముందుగా బియ్యాన్ని 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి.

స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని నూనె పోసుకోవాలి. . ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చీని, యాలకులు వేసుకోవాలి. తరువాత ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిగడ్డలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లంవెల్లుల్లి పేస్ట్‌ను వేసుకోవాలి. పచ్చి వాసన పోయిన తరువాత టమాటాలు వేుసకోవాలి. ఇప్పడు పచ్చిమిర్చిని వేసుకోవాలి. తరువత పుదీనా ,కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ,బీన్స్ , స్వీట్‌కార్న్ వేసుకోవాలి. బిర్యాని మసాలా కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకుని . కావలసినంత ఉప్పు సరిచూసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచె నీటిని పోసుకుని 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని వీటన్నింటిని కుక్ చేసుకోవాలి. మూడు గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల నీరు పోసుకోవాలి. నీరు బాగా మరిగిన తరువాత బియ్యాన్ని వేసుకోవాలి.. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టాలి... విజిల్ పెట్టుకోకుండా వదిలేయాలి. 5 నిమిషాల పాటు ఇలాగే కుక్ చేసుకోవాలి. స్టీమ్‌ వచ్చిన తరువాత విజిల్ పెట్టుకుని మూడు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ బిర్యానీ రెడీ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories