టేస్టీ గుడ్డు కారం పులుసు తయారీ ఎలా?

టేస్టీ గుడ్డు కారం పులుసు తయారీ ఎలా?
x
Highlights

ఎన్నో పోషకాలు కలిగిన గుడ్డును రోజూ తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఉడికించిన గుడ్డును నేరుగా తినడం ఇష్టం లేని వారు.

ఎన్నో పోషకాలు కలిగిన గుడ్డును రోజూ తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఉడికించిన గుడ్డును నేరుగా తినడం ఇష్టం లేని వారు... వివిధ రకాల వంటకాల్లో గుడ్డును వినియోగిస్తు తింటారు.. అందుకే అందరూ ఇష్టపడేలా కమ్మనైన టేస్టీ అయిన గుడ్డుకారం పులుసు ఎలా తయారు చేసుకోవాలి...ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

ఉడికించిన గుడ్లు: నాలుగు

♦ జీలకర్ర: టీస్పూన్

♦ కరివేపా: రెండు రెబ్బలు

♦ పచ్చిమిర్చి: రెండు

♦ ఉల్లిగడ్డ: ఒకటి

♦ టమాట: ఒకటి

♦ అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్

♦ పసుపు: అర టీస్పూన్

♦ కారం : రెండు టీ స్పూన్ లు

♦ జీలకర్ర పొడి: టీస్పూన్

♦ చింత పండు: నిమ్మపండంత

♦ దనియాల పొడి: రెండు టీస్పూన్ లు

♦ ఉప్పు: తగినంత

♦ గరం మసాలా: పావు టీస్పూన్

♦ నూనె: సరిపడినంత

♦కొత్తిమీర

తయారీ విధానం:

ముందగా స్టవ్ ఆన్ చేసుకోవాలి...స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి...ఇప్పుడు రెండు టీస్పూన్ ల నూనెlను ఇందులో వేసుకోవాలి. పావు టీస్పూన్ పసుపు కూడా వేయాలి..పావు టీస్పూన్ కారం, ఉప్పు వేసుకోవాలి. వీటిని నూనెలో కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి..ఇందులో ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి..గుడ్లు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.. గుడ్లను వేరే ప్లేట్‌లోకి తీసుకుని అదే కడాయిలో నూనె పోసుకోవాలి...పావు టీస్పూన్ జీలకర్ర వేసుకుని చిటపట లాడాక రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. పోపులోనే కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది...ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి..

పులుసు కాబట్టి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి...బాగా కలుపుకోవాలి.. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటను సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి..టమాటాలు ఎంత బాగా మగ్గితే.. కారం పులుసు అంత టేస్టీ గా ఉంటుంది..ఇప్పుడు అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరటీస్పూన్ పసుపు వేసుకోవాలి. రెండు టీ స్పూన్ ల కారం వేసుకోవాలి....ఇప్పుడు బాగా కలుపుకోవాలి...ఇందులో టీస్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి.. ఈ పులుసు అచ్చం చేపల పులుసులా టేస్టగా ఉంటుంది. పులుసు కూర కాబట్టి చింత పండు గుజ్జును ముందుగానే నానబెట్టుకుని పులుసు తీసుకోవాలి..

ఇప్పుడు ఆ పులుసును ఇందులో వేసుకోవాలి... చింతపండు గ్రైవీ చిక్కగా వచ్చేందుకు కొన్ని నీటిని వేసుకోవాలి. కడాయిపై మూత పెట్టుకుని 10 నిమిషాలు పులుసును మరగనివ్వాలి. పులుసు మరిగేప్పుడు రెండు టీస్పూన్ ల దనియాల పొడి , ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీస్పూన్ గరం మసాలా వేసుకోవాలి..బాగా కలుపుకోవాలి...ఇప్పుడు ఎగ్స్ కు గాట్లు పెట్టుకోవాలి...గాట్లు పెట్టుకోవడం వల్ల పులుసు గుడ్డులోకి ఇంకి మంచి టేస్ట్ వస్తుంది...మూత పెట్టి దగ్గరి పడేంత వరకు పులుసును మరిగించాలి. నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి... చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రెండు నిమిషాలు పాటు స్టవ్ మీద ఉంచి దించుకోవాలి... టేస్టీ గుడ్డు కారం పులుసు రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories