స్పెషల్ మటన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసా?

స్పెషల్ మటన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసా?
x
Highlights

ఆదివారం వచ్చిందంటే చాలు.... ఎవరి స్థోమతను బట్టి మటన్, చికన్ వంటకాలను చేసుకుని మస్తుగా ముద్ద లాగించేస్తారు. రోజూవారీ కూరగాయల కర్రీలతో విసుగెత్తిన వారు.

ఆదివారం వచ్చిందంటే చాలు.... ఎవరి స్థోమతను బట్టి మటన్, చికన్ వంటకాలను చేసుకుని మస్తుగా ముద్ద లాగించేస్తారు. రోజూవారీ కూరగాయల కర్రీలతో విసుగెత్తిన వారు... సండే రోజు స్పెషల్‌ నాన్‌వెజ్ వంటకాలను చేయాలనుకుంటారు... అందుకే తెలంగాణ మాసం వినియోగంలో మొదటి స్థానానికి చేరుకుంది. అందులోనూ ముఖ్యంగా మటన్ వినియోగంలో ముందు వరసలో ఉన్న రాజస్థాన్‌ను పక్కన పడేసి ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చి చేరింది. అందుకేనేమో రోజు రోజుకి మటన్ ధరలు కొండెక్కుతున్నాయి... మరి ఇంత ధర చెల్లించి కొనుగోలు చేసే మటన్‌ని అంతే స్పెషల్ గా వండుకోవాల్సిందేగా మరి ఇంకెందుకు ఆలస్యం స్పెషల్ మటన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి.

కావాల్సిన పదార్ధాలు:-

మటన్‌ - కిలో

♦ ఉల్లిగడ్డలు- నాలుగు

♦ జీలకర్ర-టేబుల్ స్పూన్

♦ లవంగాలు-మూడు

♦ కారం-రుచికి సరిపడా

♦ పసుపు- పావు టీస్పూన్‌

♦ అల్లంవెల్లుల్లి పేస్ట్- మూడు టేబుల్ స్పూన్‌లు

♦ నూనె- సరిపడినంత

♦ దాల్చిని చెక్క-సరిపడినంత

♦ గరంమసాలా-టేబుల్‌ స్పూన్

♦ కరివేపాకు- రెండు రెబ్బలు

♦ కొత్తిమీర -ఒక కట్ట

♦ పూదీనా తరుము-పిడికెడంత

♦ పచ్చిమిర్చి-ఆరు

♦ పెప్పర్ పౌడర్- టీస్పూన్

♦ నిమ్మరసం- అరచెక్క

తయారీ విధానం:

ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. నీసు వాసన పోయే విధంగా పసుపు వేసి బాగా కలిపి నీరు పోసి కడగాలి. మటన్ ఉడికించడానికి చాలా సమయం పడుతుంది. అందుకనే ముందుగా కుక్కర్ లో వేసి మటన్‌ని ఉడికించుకోవాలి. ఒక కుక్కర్ తీసుకుని అందులో ముందుగా కడిగిపెట్టుకున్న మటన్ ముక్కలను వేయాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు , అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి...వీటన్నింటిని బాగా కలుపుకుని సరిపడినంత నీరు పోసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ ముక్కలను కుక్కర్‌లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి..నీరు పోయేంత వరకు చూడాలి.

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాల..అందులో కావాల్సిన నంత నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి...వీటితో పాటే పొడవుగా కత్తిరించి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను అందులో వేసుకోవాలి..వీటిని బాగా వేపుకోవాలి...ఇప్పుడు లవంగాలు, దల్చీని చెక్క వేసుకోవాలి...తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి. బాగా కలిపి వేపుకోవాలి...ఇందులోనే మిరియాల పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి..

వీటిని బాగా కలుపుకోవాలి..సన్నటి మంట మీద మట్‌ను ఫ్రై చేసుకోవాలి..సుమారు 10 నిమిషాల పాటు వేపుకోవాలి..ఫ్రై కాబట్టి మూత పెట్టుకోకూడదు. ఇప్పుడు నిమ్మరం వేసి బాగా కలుపుకోవాలి...అందే టేస్టీ స్పెషల్ మటన్ ఫ్రై రెడీ.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories