ఎర్ర పాలకూర ఫ్రై తయారీ ఎలా..?

ఎర్ర పాలకూర ఫ్రై తయారీ ఎలా..?
x
Highlights

పాలకూర పోషకాల గని. దీనిలో ఇనుము అధికంగా ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సీజన్‌ను సరఫరా చేసే ఎర్ర రక్తకణాల పనితీరులో ఇనుము కీలక పాత్ర పోషిస్తుంది....

పాలకూర పోషకాల గని. దీనిలో ఇనుము అధికంగా ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సీజన్‌ను సరఫరా చేసే ఎర్ర రక్తకణాల పనితీరులో ఇనుము కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, విటమిన్ కె, మిటమిన్ బి12 , ఫోలిక్‌యాసిడ్, మాంగనీస్‌, మెగ్నీషియం కూడా ఇందులో ఉంటాయి. అంతే కాదు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్ కె పాలకూరలో లభించినంత మరే కూరగాయల్లోనూ ఉండదు.

కావలసిన పదార్ధాలు :

రెడ్ స్పినాచ్

కందిపప్పుఉప్పు

ఆవాలు

నూనె

చిన్న ఉల్లిగడ్డలు

వెల్లుల్లి రెబ్బలు

పచ్చిరిచ్చి

కరివేపాకు

తయారీ విధానం :

ముందుగా పాలకూరను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని నీటిలో శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు కడిగి ఉంచాలి. తరువాత కందిపప్పును 25 గ్రాముల కంది పప్పును కడిగి, బాగా ఉడికించి ఉంచాలి. ఇఫ్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తరువాత రెండు టేబుల్ స్పూన్ ల నూనె వేసుకోవాలి...నూనె కాస్త వేడెక్కగానే ఆవాలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్ననచిన్న ఉల్లిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. వీటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్‌రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. ఇప్పుడు పాలకూరను వేుసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మూడు నిమిషాల వరకు మగ్గనివ్వాలి.. పాలకూరకు మంచి కలర్ రానివ్వాలి..నీళ్లు అస్సలు ఆడ్ చేయకూడదు..రెండు నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి..రెడ్ స్పినాచ్ ఫ్రై రెడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories