విటమిన్ 'డి' లోపానికి రాగి సంకటి చక్కటి పరిష్కారం

రాగుల్లో కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. చర్మానికి మేలు చేసే మిథియోనైన్‌, లైసిన్‌ వంటి అమైనోయాసిడ్లు ఉంటాయి. సూర్యకాంతి ద్వారా లభించే విటమిన్‌ డి రాగుల్లో కూడా ఉంటుంది. నిత్యం రాగులను ఏదో ఒక రూపంలో తీసుకుంటే విటమిన్‌ డి లోపం సమస్యను అధిగమించవచ్చు. రక్తహీనతో బాధపడేవారికి రాగులు చక్కని ఔషధం . డిప్రెషన్‌, నిద్రలేమి, మానసిక ఒత్తిడి తదితర సమస్యలను నయం చేసే గుణాలు రాగుల్లో ఉన్నాయి.

కావలసిన పదార్ధాలు

బియ్యం : పిడికెడు

రాగి పిండి : ఒక కప్పు

నీళ్ళు : 4 కప్పులు

ఉప్పు : 1/4 స్పూన్

తయారీ విధానం :

మొదట బియ్యాన్ని ఒక పాత్రలో వేసి శుభ్రం చేసి నీళ్ళు, ఉప్పు కలిపి ఉడికించాలి. బియ్యం మెత్తగా ఉడికిన తరువాత అందులో రాగిపిండి వేసి, మూత పెట్టి మరోసారి కొద్ది సేపు ఉడికించాలి. తర్వాత గరిటతో కాని, పప్పు గుత్తితో కాని మెత్తగా ఉండలు లేకుండా మెదపాలి. స్టౌవ్ మంటను తగ్గించి మళ్ళీ గట్టిపడేవరకు మెళ్లిగా ఉడికించి దించుకోవాలి. అంతే రాగి సంకటి రెడీ. కాస్త చల్లారిన తర్వాత తడిచేతితో ముద్దలుగా చేసుకుని నాటుకోడి ఇగురు లేదా బచ్చలి కాంబినేషన్‌తో తింటే... చాలా బాగుంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories