ఆరోగ్యానికి రాగి కేక్‌.. తయారీ ఎలా?

ఆరోగ్యానికి రాగి కేక్‌.. తయారీ ఎలా?
x
Highlights

రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది మరియు ముఖ్యంగా...

రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది మరియు ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉంటుంది . ఇది చాలా సులభంగా జీర్ణమయ్యే ఆహారం

కావలసినవి పదార్ధాలు :

రాగి పిండి – ముప్పావు కప్పు

గోధుమ పిండి – ముప్పావు కప్పు

బేకింగ్‌ పౌడర్‌ – ఒక టీ స్పూను

బేకింగ్‌ సోడా – అర టీ స్పూను

ఉప్పు – చిటికెడు

కోకో పొడి – 2 టేబుల్‌ స్పూన్లు

బెల్లం పొడి – ఒక కప్పు

కొబ్బరి పాలు – ముప్పావు కప్పు

వెనిలా ఎసెన్స్‌ – ఒక టేబుల్‌ స్పూను

కరిగించిన బటర్‌ – 150 మిల్లీ లీటరు

పెరుగు – పావు కప్పుటాపింగ్‌ కోసం

కొబ్బరి పాలు – ఒక కప్పు

కోకో పొడి – 3 టేబుల్‌ స్పూన్లు

పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం:

ముందుగా కేక్‌ ప్యాన్‌కి కొద్దిగా నెయ్యి పూయాలి. అవెన్‌ను 170 డిగ్రీల దగ్గర కనీసం పావు గంట సేపు ప్రీహీట్‌ చేయాలి. రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్‌ పౌడర్, ఉప్పు, కోకో పొడి. వీటన్నిటినీ జల్లించి పక్కన ఉంచాలి. మరో రెండు సార్లు జల్లెడ పట్టాలి. మెత్తగా చేసిన బెల్లం పొడి ఇందులో కలపాలి. ముప్పావు కప్పు కొబ్బరి పాలు పోయాలి. కరిగించిన బటర్, పెరుగు ఇందులో వేయాలి.ఉండలు లేకుండా అన్నీ బాగా కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. నెయ్యి రాసిన ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి, అవెన్‌ సుమారు అరగంట సేపు ఉంచాలి. బయటకు తీయడానికి ముందు సుమారు పావు గంట సేపు చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో పాలు, పంచదార, కోకో పొడి వేసి స్టౌ మీద ఉంచి, పంచదార కరిగేవరకు బాగా గిలకొట్టాలి. మంట బాగా తగ్గించి, ఈ మిశ్రమాన్ని మరిగించాలి. ఇందులో వెనిలా ఎసెన్స్‌ వేసి, మిశ్రమం చిక్కబడేవరకు కలియబెట్టి, దింపి చల్లారబెట్టాలి. మిశ్రమం చిక్కగా, క్రీమీగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని కేక్‌ మీద సమానంగా పోసి, నైఫ్‌తో సరిచేయాలి. యమ్మీ రాగి కేక్ రెడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories