పెసర పప్పు చపాతి తయారీ ఎలా..?

పెసర పప్పు చపాతి తయారీ ఎలా..?
x
Highlights

గోధుమలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న సాధారణ తృణధాన్యాలు. అధికమైన ఆరోగ్య ప్రయోజనాల వలన కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. గోధుమల్లో ఖనిజ లవణాలు,...

గోధుమలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న సాధారణ తృణధాన్యాలు. అధికమైన ఆరోగ్య ప్రయోజనాల వలన కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. గోధుమల్లో ఖనిజ లవణాలు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్, క్లోరిన్, ఆర్సెనిక్, సిలికాన్, మాంగనీస్, జింక్, ఐయోడైడ్, రాగి, విటమిన్ బి, మరియు విటమిన్ E వంటివి పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనత, ఖనిజ లోపాలు, పిత్తాశయ రాళ్ళు, రొమ్ము క్యాన్సర్, ఊబకాయం, క్షయ, సమస్యలను త్వరగా గోధుమ లు మెరుగుపరుస్తాయి. దీనిలో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువ గా ఉండడం వలన గుండె ఆరోగ్యం కుడా రక్షించ బడుతుంది.

కావలసిన పదార్ధాలు :

ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు

గోధుమ పిండి

కారం

దనియాల పొడి

గరం మసాలా

జీలకర్ర

ఉప్పు

తయారీ విధానం

ముందుగా బౌల్ లో గోదుమ పిండిని తీసుకోవాలి. ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి..బాగా కలుపుకున్న తరువాత కారం, దనియాల పొడి, గరంమసాలా , జీలకర్ర వేసుకోవాలి..నీటికి బదులుగా ఉడికించిన పెసరపప్పుతో ముందగా చేసుకోవాలి. చపాతీ పిండిలా పిండిని కలుపుకున్న తరువాత కొంచెం నూనె పోసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం నీటిని యాడ్ చేసుకోవచ్చు. పిండిని కలిపి 10 నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడ చపాతీ పిండిని తీసుకుని ముద్దలుగా చేసుకోవాలి..పిండి ముద్దను తీసుకుని చపాతీలను చేసుకోవాలి.చపాతీని కాస్త చిన్నగా రోల్ చేసుకుని నూనె కాస్త చపాతీకి రాసి ఫోల్డ్ చేసుకోవాలి. . దీని వల్ల చపాతీ చాలా సాప్ట్ గా వస్తుంది. ఇప్పుడు మళ్లీ చపాతీని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టకుకుని చపాతీని వేసుకోవాలి.చపాతీ చుట్టూ లైట్ గా ఆయిల్ వేసుకోవాలి..చపాతీ బాగా కాలిన తరువాత ప్లేట్‌లోకి తీసుకోవాలి..వేడి వేడి పెసరపపప్ను చపాతీ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories