పన్నీర్ పకోడీ తయారీ ఎలా?

పన్నీర్ పకోడీ తయారీ ఎలా?
x
Highlights

పనీర్ దేశంలో ప్రముఖమైన ఆహార పదార్థం. శాకాహారులు, మాంసాహారులు సమానంగా ఇష్టపడే ఆహారం. పాలనుంచి తయారయ్యే పనీర్ లో అనేక పోషకాలుండి ఆరోగ్యానికి చాలా...

పనీర్ దేశంలో ప్రముఖమైన ఆహార పదార్థం. శాకాహారులు, మాంసాహారులు సమానంగా ఇష్టపడే ఆహారం. పాలనుంచి తయారయ్యే పనీర్ లో అనేక పోషకాలుండి ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమందైతే పనీర్ ను పచ్చిగానే ఇష్టపడతారు.పన్నీర్ లో ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకల రోగాలను, పళ్ళ సమస్యలను పోగొట్టి వాటిని గట్టిపరుస్తుంది. పనీర్ లో ఉండే విటమిన్ డి దంతాల కావిటీలు రాకుండా చేస్తుంది. పనీర్ లోని పీచుపదార్థం జీవక్రియను పెంచి బరువు తగ్గటంలో సాయపడుతుంది విటమిన్ బి, ఒమెగా-3 మరియు 6 ఫ్యాటీ యాసిడ్లు, యాంటి ఆక్సిడెంట్లు ఉండటం వల్ల జుట్టుకి, చర్మానికి మంచిది. చర్మం ముడతలు పడకుండా, వాపు కలిగించే డెర్మటైటిస్ ను ఆపటానికి పనీర్ సాయపడుతుంది.

కావలసిన పదార్థాలు:

పన్నీర్ – పావుకిలో

శెనగపిండి – 1 కప్పు

కారం – స్పూన్

పచ్చిమిర్చి – 4

ఉప్పు – తగినంత

నూనె – సరిపడా

తయారీ విధానం :

ముందుగా ఓ బౌల్‌లో శెనగపిండి, నీళ్లు పోసి కలుపుకోవాలి. అందులోనే కారం పొడి, పచ్చిమిర్చి తురుము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంటపాటు అలా వదిలేయాలి. ఈ లోపు పన్నీర్ ముక్కల్ని కాస్త చిన్న చిన్నగా కట్ చేసుకుని వాటిపై కారం, ఉప్పు చిలకరించాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడిచేయాలి. నూనె కాగిన తరువాత శెనగపిండి మిశ్రమంలో పన్నీర్ ముక్కల్ని వేసి పకోడీల్లా వేయించుకోవాలి. అవి గోల్డ్ ‌బ్రౌన్ రంగులోకి మారే వరకు వేయించి తీసుకోవాలి. అంతే పన్నీర్ పకోడీలు రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories