ఓట్స్ మంచూరియా తయారీ ఎలా?

ఓట్స్ మంచూరియా తయారీ ఎలా?
x
Highlights

ప్రస్తుత రోజుల్లో ఓట్స్ ను ఒక సూపర్ ఫుడ్ గా పరిగనిస్తున్నారు. మధుమేహగ్రస్తులకు మరియు హై బ్లడ్ ప్రెజర్ ఉన్నపేషంట్స్ కు ఓట్స్ ఒక గొప్ప ఆరోగ్యకరమైన ...

ప్రస్తుత రోజుల్లో ఓట్స్ ను ఒక సూపర్ ఫుడ్ గా పరిగనిస్తున్నారు. మధుమేహగ్రస్తులకు మరియు హై బ్లడ్ ప్రెజర్ ఉన్నపేషంట్స్ కు ఓట్స్ ఒక గొప్ప ఆరోగ్యకరమైన ఆహారపదార్థం. అయితే కొంత మంది ఓట్స్ తినడానికి ఇష్టపడరు . కొంత మందికి ఓట్స్ ను ఒకే పద్దతిలో తయారుచేసుకొని తినడానికి ఇష్టపడరు. కానీ, ఓట్స్ ను ఆరోగ్యకరంగా తయారుచేసుకొని తినడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటే ఓట్స్ మంచూరియా.

కావలసిన పదార్ధాలు :

ఓట్స్ – 2 కప్పులు

క్యారెట్, క్యాబేజ్, కీరా – అరకప్పు

బీన్స్ – పావుకప్పు

ఉల్లిపాయలు – 2

పచ్చిమిర్చి – 5

కొబ్బరి తురుము – పావుకప్పు

క్యాప్సికం – పావుకప్పు

అల్లం వెల్లుల్లి పేస్ట్ – అరచెంచా

సోయాసాస్ – అరస్పూన్

టమాటా కెచప్ – 3 స్పూన్స్

అజినోమోటో – కొద్దిగా

ఉప్పు – అరచెంచా

నూనె – సరిపడా

కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం:

ముందుగా ఓట్స్‌ను వేయించుకుని పొడిచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో 2 స్పూన్ల నూనె వేడిచేసి క్యాప్సికం మినహా మిగిలిన కూరగాయముక్కలు, సగం ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. ఆపై కొద్దిగా వేగాక అందులో కొబ్బరి తురుము చేర్చుకోవాలి. ఈ మిశ్రమంలో ఓట్స్ పొడి, ఉప్పు కలిపి నీళ్లు చల్లి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్నవాటిని నూనెలో వేయించుకోవాలి. నూనె ఎక్కువగా వద్దనుకుంటే ఆవిరిమీద కూడా ఉడికించుకోవచ్చు. తరువాత కడాయిలో కొద్దిగా నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి మిశ్రమం, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, అజినోమోటో వేయాలి. వేయించి సోయాసాన్, టమోటా కెచెప్ కలుపుకోవాలి. చివరగా ఓట్స్ ఉండల్ని కూడా వేసి 2 నుండి 3 నిమిషాలు వేయించి తీసి కొత్తిమీర చల్లుకోవాలి. హాట్ హాట్ ఓట్స్ మంచూరియా రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories