మటన్ పులుసు ఇలా తయారు చేసుకుంటే అమోఘం

మటన్ పులుసు ఇలా తయారు చేసుకుంటే అమోఘం
x
Highlights

మటన్ పులుసును తాయారు చేయాలంటే ముందుగా 250 గ్రాముల మటన్‌ను ఒక ప్లేట్‌ లోకి తీసుకుని శుభ్రంగా కడగి పక్కన పెట్టుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు:

మటన్

♦ ఉల్లిపాయలు

♦ టమాటాలు

♦ ఎండుమిర్చి

♦ అల్లం

♦ వెల్లుల్లి

♦ ధనియాలు

♦ ఉప్పు

♦ పసుపు

♦ నూనె

♦ నెయ్యి

♦ లవంగాలు

♦ యాలకులు

♦ దాల్చిన

♦ కొత్తిమీర

తయారీ విధానం:

మటన్ పులుసును తాయారు చేయాలంటే ముందుగా 250 గ్రాముల మటన్‌ను ఒక ప్లేట్‌ లోకి తీసుకుని శుభ్రంగా కడగి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె కాస్త కాగా గానే అందులో 10 ఎండు మిరపకాయలను వేసుకోవాలి.. అలాగే రెండు టేబుల్ స్పూన్‌ల ధనియాలు వేసుకుని వేగించాలి. బాగా కలుపుతూ ఉండాలి. లేదంటే మాడిపోతాయి. మిరపకాయలు, ధనియాలు వేగాక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి.. అందులోనే అల్లం వెల్లుల్లిని వేసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో నూనె పోయాలి. నూనెతో పాటు రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి వేసుకోవాలి.. దీని ద్వారా డిష్‌కి మంచి ఫ్లేవర్ వస్తుంది.

ఇప్పుడు రెండు యాలాకులు, రెండు లవంగాలు , చిన్న దాల్చిన ముక్క ఇందలో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేగనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రూ చేయాలి. ఇప్పుడు ఒకటి లేదా రెండు టమోటాలను ముక్కలగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మటన్‌ను ఇందులోప వేసుకోవాలి. మటన్‌లోని నీరు పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగానే నూరి పెట్టుకున్న పచ్చి మసాలా పేస్ట్‌ను ఇందులో వేసుకోవాలి. వాటితో పాటే పసుపు, ఉప్పు వేసుకోవాలి... కాసేపు వేగించాలి.. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. కూర బాగా మరిగి నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి.. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి.. అంతే టేస్టీ టేస్టీ మటన్ పులుసు రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories