నోరూరించే పచ్చిమిర్చి బజ్జి తయారీ ఎలా?

నోరూరించే పచ్చిమిర్చి బజ్జి తయారీ ఎలా?
x
Highlights

పచ్చి మిర్చిలో శరీరపు మెటబాలిజంను ప్రేరేపించే క్యాస్పేసియన్ అనే ఓ పదార్థం ఉంది. దీంతో తయారైన సప్లిమెంట్స్‌ తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా...

పచ్చి మిర్చిలో శరీరపు మెటబాలిజంను ప్రేరేపించే క్యాస్పేసియన్ అనే ఓ పదార్థం ఉంది. దీంతో తయారైన సప్లిమెంట్స్‌ తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుందట. మిరపకాయల్లోని క్యాస్పేసియన్ రసాయనం వల్లే మిర్చిని తింటే మంట పుడుతుంది. ఇది మెదడులోని హైపోథాలమస్ అనే కేంద్రాన్ని ప్రేరేపించడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. పచ్చి మిరపకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. పక్షవాతాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. మిరపకాయ రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని వృద్ధి పరుస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. దెబ్బ తగిలినపుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉంది.

కావలసిన పదార్ధాలు :

సెనగపిండి : 1 కప్

ఉప్పు : తగినంత

పసుపు : చిటికెడు

వాము : 3-4 చెంచాలు

ఉల్లిపాయ : 2

లావు మిరపకాయలు : 5-6

కొత్తిమీర : 2-3 చెంచాలు

నిమ్మరసం : 2-3 చెంచాలు

కారం : 1 చెంచా

బియ్యంపిండి : 3-6 చెంచాలు

నూనె వేయించడానికి సరిపడా

సేవ్: 2-3 చెంచాలు

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి, బియ్యంపిండి ఉప్పు, కారం వాము ,నీళ్లు వేసి బజ్జి పిండిలా వేసుకోవాలి ఇప్పుడు మిరపకాయ ని మధ్యలో చిలుచుకోవాలి

దానిలో వాము ఉప్పు మిశ్రమం కురుకోవాలి దానిని సెనగపిండి మిశ్రమం లో ముంచి వేడి వేడి నూనె లో వేయించుకోవాలి వేగిన వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఉల్లిపాయ ఉప్పు కొత్తిమీర నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి దానిని మిరపకాయ మీద పెట్టుకొని సేవ్ వేసుకోవాలి. అంతే వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories