మామిడి ఆవకాయ ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది

మామిడి ఆవకాయ ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది
x
Highlights

సౌత్ ఇండియాలో సమ్మర్ వచ్చిందంటే చాలు తెలుగు గుమ్మాళ్లో అవకాయ రుచులు రామ్మంటాయి. ఎండాకాలం కావడంతో పచ్చళ్ల సీజన్‌గా భావిస్తుంటారు మహిళలు.

సౌత్ ఇండియాలో సమ్మర్ వచ్చిందంటే చాలు తెలుగు గుమ్మాళ్లో అవకాయ రుచులు రామ్మంటాయి. ఎండాకాలం కావడంతో పచ్చళ్ల సీజన్‌గా భావిస్తుంటారు మహిళలు. ముఖ్యంగా మామిడి పండ్లు చేతికి వచ్చే రోజులు కావడంతో మామిడి రుచిని ఏడాది పొడవునా ఆస్వాదించేందుకు పచ్చళ్లు చేసుకుంటుంటారు. ఎర్రగా కనిపించే ఆవకాయలంటే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. మరి మామిడి ఆవకాయ ఎలా తాయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

కావాల్సిన పదార్ధాలు:

పచ్చడి మామిడి కాయలు

♦ కారం

♦ ఆవపిండి

♦ ఉప్పు

♦ పసుపు

♦ మెంతులు

♦ చిన్న శనెగలు

♦ నువ్వుల నూనె

తయారీ విధానం:

ముందుగా పచ్చి మామిడి కాయలను శుభ్రంగా కడగాలి. తరువాత చక్కటి పొడి బట్టతో తుడిచి పెట్టుకోవాలి..అనంతరం ముక్కలుగా కోసుకోవాలి..ఎవరి ఇష్టానుసారంగా వారు మామిడి ముక్కలను కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి...దానిలో 200 గ్రాముల కారం వేసుకోవాలి. తరువాత 200 గ్రాముల ఆవపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా 200 గ్రాములు వేసుకోవాలి. ఇందులోనే రెండు టీస్పూన్‌ల పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 25 గ్రాముల ఎంతులు వేసుకోవాలి.

అదే విధంగా చిన్న శనగలు వేసుకోవాలి...వీటన్నింటిని బాగా కలుపుకోవాలి...ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను ఇందులో వేసుకోవాలి...ఇప్పుడు నువ్వుల నూనె తీసుకుని కొద్ది కొద్దిగా తడిగా , పొడిగా ఉండేటట్లు కలుపుకోవాలి..కొద్దిగా నూనెను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జాడీ తీసుకుని అందులో ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నూనెను కూడా వేసుకోవవాలి. ఇప్పుడు జాడీకి మూత పెట్టి గుడ్డ కట్టి నిల్వ చేయాలి..మూడు రోజుల తరువాత బాగు ఊరుతుంది...ఇప్పుడు రుచి చూసి ఏమైనా తక్కువగా ఉంటే కలుపుకోవాలి..అంతే టేస్టీ టేస్టీ ఆవకాయ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories