సమ్మర్ లో కూల్ కూల్ కుల్ఫీ.. ఇలా చేసుకోండి..

సమ్మర్ లో కూల్ కూల్ కుల్ఫీ.. ఇలా చేసుకోండి..
x
Highlights

సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలు ఐస్ పార్లర్లకు వెళ్దామని తెగ మారాం చేసేస్తుంటారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూల్ కూల్ ఐస్ క్రీంలు తినాలనుకుంటారు.

సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలు ఐస్ పార్లర్లకు వెళ్దామని తెగ మారాం చేసేస్తుంటారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూల్ కూల్ ఐస్ క్రీంలు తినాలనుకుంటారు. కానీ బయట తినే ఐస్‌క్రీమంలపై ఆరోగ్య భద్రత లేదు.. అందుకే ఈ వేసవిలో ఇంట్లోనే పాలతో చక్కగా కుల్ఫీలను తయారు చేసుకోవాచ్చు. కమ్మగా టేస్టీగా ఉండే ఈ కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి

కావాల్సిన పదార్ధాలు:

చిక్కటి పాలు: అర లీటరు

♦ పంచదార: రుచికి సరిపడా

♦ జీడిపప్పు : పది

♦ బాదం పప్పు : పది

♦ పిస్తా: పది

♦ ఇలాచీ : మూడు

♦ కుల్ఫీ మౌల్డ్స్: మూడు

♦ ఐస్ స్టిక్స్‌ : మూడు

తయారీ విధానం:

ముందుగా అరలీటరు చిక్కటి పాలను తీసుకోవాలి.. వీటిని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో పోసుకుని మరిగించాలి. ఈ పాలు సగం అయ్యే వరకు మరిగించుకోవాలి.. మధ్యలో పొంగు వచ్చేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ పాలను మరిగించాలి.. సగం అయ్యే వరకు ఇలాగే అనుసరించాలి.

ఇప్పుడు జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా ,ఇలాచీలను మిక్సీ జార్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా రవ్వ రవ్వగా ఆడించాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాలు కాస్త తిక్ అయ్యాక సరిపడినంత పంచదాల వేసుకుని కలుపుకోవాలి. 2 నుంచి 3 నిమిషాలు మరిగించాలి... ఇప్పుడు స్పూన్‌కి పాలు అంటుకున్నప్పుడు నట్స్ పౌడర్ వేసుకోవాలి.. ఈ నట్స్ పొడి వల్ల కుల్ఫీకి మంచి టేస్ట్ వస్తుంది.. పాలు తిక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.... పాలను మరీ తిక్ అవ్వనీయకూడదు. తరువాత పాలు చల్లారాక కుల్ఫీ మౌల్డ్స్ లో పోసుకోవాలి.

కుల్ఫీ మౌల్డ్స్ లేకుంటే టీ గ్లాసుల్లో కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు వీటి పైన అల్యూమీనియం పేపర్‌ తో కవర్ చేసుకోవాలి... ఇలా చేయడం వల్ల కుల్ఫీ పైన ఐస్ ఏర్పడదు. మొత్తం మౌల్డ్స్ ను సీల్ చేసుకుని పెట్టుకోవాలి. లైట్‌గా మధ్యలో హోల్ చేసి ఐస్ స్టిక్స్ పెట్టుకోవాలి... దీన్ని ప్లేట్‌లో పెట్టకుని 8 గంటలు ప్రిజ్‌లో పెట్టుకోవాలి... సమయం పూర్తైన తరువాత ఫ్రిజ్‌లోంచి కుల్ఫీలను తీయాలి... ఇప్పుడు అల్యూమీనియం పేపర్ తీసివేయాలి... అంతే కుల్పీ రెడీ అయ్యింది. ఇప్పుడు బౌల్‌లో కొన్ని వాటర్ తీసుకుని మౌల్డ్స్ ను ఉంచితే ఈజీగా కుల్ఫీ వచ్చేస్తుంది. అంతే ఇంట్లోనే పాలతో కూల్ కూల్ కుల్ఫీలను రెడీ చేసుకోవచ్చు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories