ఖీమా సమోసా తయారీ ఎలా?

ఖీమా సమోసా తయారీ ఎలా?
x
Highlights

మటన్‌లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఐరన్‌ ఉంటుంది. ఫ్యాట్‌ తక్కువ ప్రమాణాల్లో ఉంటుంది.శరీరానికి అవసరమయ్యే పోషకవిలువలు మటన్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇది మంచి...

మటన్‌లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఐరన్‌ ఉంటుంది. ఫ్యాట్‌ తక్కువ ప్రమాణాల్లో ఉంటుంది.శరీరానికి అవసరమయ్యే పోషకవిలువలు మటన్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇది మంచి పౌష్టికాహారం. ఇందులో బి1, బి2, బి3, బి9, బి12 విటమిన్లు ఉంటాయి. విటమిన్‌-ఇ, కె, సహజ ఫ్యాట్స్‌, కొలెస్ట్రాల్‌, అమినోయాసిడ్స్‌, ఖనిజాలు , ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఒమేగా6 ఫ్యాటీయాసిడ్స్‌ ఉంటాయి. ఇందులో ప్రొటీన్లు, న్యూట్రియంట్లు, బి12 బాగా ఉండడం వల్ల కొవ్వును కరిగించే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది.

కావలసిన పదార్ధాలు :

మైదా : పావుకిలో

ఖీమా: అరకిలో

ఉల్లిపాయ: ఒకటి

పచ్చిమిర్చి: నాలుగు

అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను

గరంమసాలా: ఒకటిన్నర టీస్పూన్లు

కొత్తిమీర తురుము

పుదీనా తురుము

పెరుగు: టేబుల్‌స్పూను

ఉప్పు: తగినంత

నూనె

తయారీ విధానం :

ముందుగా మైదాలో నాలుగు టేబుల్‌స్పూన్ల నూనె, ఉప్పు వేసి కలిపి చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండనీ చపాతీలా చేసి రెండుగా కోసి మూతపెట్టి ఉంచాలి. రెండు టేబుల్‌స్పూన్ల మైదాలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి పేస్టులా చేసి పక్కన ఉంచాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. తరవాత కీమా, ఉప్పు వేసి సిమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు గరంమసాలా, పెరుగు, కొత్తిమీర, పుదీనా తురుము వేసి కలిపి దించాలి. ఇప్పుడు చపాతీని కోన్‌లా చుట్టాలి. అందులో కూర మిశ్రమాన్ని పెట్టి జాగ్రత్తగా మడిచి అంచులు విడిపోకుండా మైదా పేస్టుతో అతికించాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించాలి. లైట్ బ్రౌన్ కలర్ లోకి రాగానే తీసుకోవాలి.వేడి వేడి ఖీమా సమోసా రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories