Top
logo

పిల్లలు ఎంతగానో ఇష్టపడే పీజాను ఇంట్లోనే ఇలా తయారుచేసుకోవచ్చు

పిల్లలు ఎంతగానో ఇష్టపడే పీజాను ఇంట్లోనే ఇలా తయారుచేసుకోవచ్చు
X
Home made Pizza
Highlights

సమ్మర్ వచ్చేసింది.. పిల్లలకు స్కూల్ హాలిడేస్‌ కూడా రేపో మాపో ఇచ్చేస్తారు..ఇక ఇంట్లో ఉండే పిల్లలు అది కొనివ్వమిని..అక్కడకు వెల్దామని మారాం చేస్తుంటారు.. బయట ఫుడ్ తినాలని పేరెంట్స్‌ను విసిగించేస్తుంటారు.

సమ్మర్ వచ్చేసింది.. పిల్లలకు స్కూల్ హాలిడేస్‌ కూడా రేపో మాపో ఇచ్చేస్తారు...ఇక ఇంట్లో ఉండే పిల్లలు అది కొనివ్వమిని..అక్కడకు వెల్దామని మారాం చేస్తుంటారు.. బయట ఫుడ్ తినాలని పేరెంట్స్‌ను విసిగించేస్తుంటారు..

అలాంటి పిల్లలను ఆకట్టుకునేందుకు ఎంతో ఈజీగా ఇంట్లోనే వెరైటీ వంటలను తయారుచేసుకోవచ్చు.. మరి పిల్లలు ఎంతగానో ఇష్టపడే పీజాను ఇంట్లో ఎంత సులువుగా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం పదండి.

కావాల్సిన పదార్ధాలు :

మైదా

♦ గోధుమపిండి

♦ వాము

♦ వెల్లుల్లి రెబ్బలు

♦ మిర్చి

♦ తులసి ఆకులు

♦ మిరియాలు

♦ ఈస్ట్‌

♦ పంచదార

♦ నూనె

♦ ఉప్పు

♦ చీజ్‌

♦ టమాట సాస్

♦ వెల్లుల్లి పొడి

♦ కారం

తయారీ విధానం :

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నీరు పోసుకుని మరిగించాలి.. తరువాత.. వేడినీటిలో ఈస్ట్‌ని సుమారు 5 నిమిషాలు నురుగు వచ్చే వరకు నానబెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు కప్పుల మైదాపిండి వేసుకోవాలి.. అదే విధంగా అరకప్పు గోధుమపిండి వేసుకోవాలి.. ఇప్పుడు ఇందులో అరటీస్పూన్ వాము వేయాలి. ఇప్పడు వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. ఇందులో మూడు మిరపకాలను చిన్నగా కట్‌ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కాసిన్న తులసి ఆకులు వేసుకోవాలి. ఇప్పడు నాలుగు పెప్పర్‌ను తీసుకుని పొడి చేసి అ వేసుకోవాలి.

ఇప్పుడు వీటన్నింటిని నీటితో కలుపుకుని చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దపై తడిగుడ్డతో కప్పు ఉంచి గంట పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒవెన్‌ను ఆన్ చేసి పెట్టుకుని పిండిముద్దని చపాతీలా వత్తుకోవాలి.. రౌండ్ షేప్ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు పిజ్జా సాస్ తయారు చేసుకోవాలి...టమోట సాస్‌లో వెల్లుల్లి పొడిని ఇక స్పూన్ వేసుకోవాలి.

ఇందులోనే ఒక టీస్పూన్ కారం వేయాలి..రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి...పిజ్జి సాస్‌ రెడీ అయిన తరువాత చపాతీలా చేసుకున్న రొట్టెపై ఈ సాస్‌ను మందంగా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద చీజ్‌ని చల్లుకోవాలి. టాపింగ్స్ కోసం మీరు ఏమైన వేసుకోవచ్చు. ఆలివ్స్‌, టమోట, మష్‌రూమ్స్‌, క్యాప్సిమ్ ఇలా వేసుకుని మళ్లీ చీజ్ ను చల్లుకోవాలి. ఇప్పుడు ఓవెన్‌ను 350 ఫారన్ హీట్ దగ్గర సెట్ పిజ్జాను అందులో పెట్టుకుని సుమారు 18 నుంచి 2 0 నిమిషాల పాటు ఉంచిదే..అంతే వేడి వేడి పిజ్జీ రెడీ.


Web TitleHow to make homemade pizza
Next Story