నోరూరించే గోంగూర మటన్ తయారీ ఎలా?

నోరూరించే గోంగూర మటన్ తయారీ ఎలా?
x
Highlights

గోంగూర మటన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..దీని టేస్ట్ చూసిన వారందరికీ ఇది మంచి యమ్మీ కర్రీ. గోంగూరలో ఉండే పోషకాలు.

గోంగూర మటన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..దీని టేస్ట్ చూసిన వారందరికీ ఇది మంచి యమ్మీ కర్రీ. గోంగూరలో ఉండే పోషకాలు.. మటన్‌ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిసవారు తప్పక ఈ డిష్‌ను ఇష్టపడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం గోంగూర మటన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం...పదండి.

కావాల్సిన పదార్ధాలు:

మటన్

♦ గోంగూర

♦ ఉల్లిగడ్డలు

♦ కొబ్బరి

♦ అల్లంవెల్లుల్లిపేస్ట్‌

♦ లవంగాలు

♦ ఇలాచీ

♦ ధనియాలు

♦గసగసాలు

♦ పసుపు

♦ ఉప్పు

♦ కారం

♦ కొత్తిమీర

తయారీ విధానం:

ముందుగా అరకిలో మటన్ ముక్కలను తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నెపెట్టి నీరు పోసి , నీరు మరిగాక మటన్ ముక్కలు వేసుకోవాలి..ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వేడినీటితో మటన్‌ ముక్కలను ఉడికించాలి.

ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకోవాలి...అందులో నూనె వేసుకోవాలి. నూనె కాస్త కాగాక రెండు ఉల్లిగడ్డలను సన్నగా తరిగిన ముక్కలను వేసుకోవాలి. వీటిని బాగా మగ్గనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు రెండు టీస్పూన్‌ల అల్లంవెల్లుల్లిపేస్ట్‌ ను ఇందులో వేసుకోవాలి.పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుని కలుపుకోవాలి.

ఇప్పుడు ముందుగా వేడినీటిలో మరిగించి పెట్టుకున్న మటన్ ముక్కలను కడాయిలో వేసుకోవాలి. బాగా కలిపి వేపుకోవాలి. ఐదు నిమిషాల తరువాత రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. మటన్‌ ముక్కలను బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొబ్బరిని తీసుకుని దాన్ని తురిపి పొడి చేసుకోవాలి...సుమారుగా రెండు టీస్పూన్‌ల పొడిని ఇందులో వేసుకోవాలి. 15 నిమిషాల పాటు మటన్‌ను ఉడికించాలి...

ఇప్పుడు మసాలా తయారుచేసుకుందాం...

నాలుగు లవంగాలు, నాలుగు ఇలాచీలు, టీస్పూన్ గసగసాలు టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకుని ప్రై పాన్‌లో డ్రై ఫ్రై చేసుకోవాలి..తరువాత మిక్సీ జార్ లో వీటిని వేసుకుని,పొడి చేసుకోవాలి...

15 నిమిషాల పాటు మటన్ ముక్కలు ఉడికిన తరువాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు వేసుకోవాలి..వీటిని మూత పెట్టి మాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చివరగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకోవాలి. చివరగా కొత్తి మీర వేసుకోవాలి. అంతే టేస్టీ గోంగూర మటన్ రెడీ.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories