కొర్రలతో అంబలిని ఆవకాయతో తీసుకుంటే..

కొర్రలతో అంబలిని ఆవకాయతో  తీసుకుంటే..
x
Highlights

మన నవీకరణ పమాజలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తీసుకునే ఆహారమే ఆనారోగ్య పరిస్థితిని తీసుకవస్తుంది. కావున అందరూ ఆహారం విషయంలో...

మన నవీకరణ పమాజలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తీసుకునే ఆహారమే ఆనారోగ్య పరిస్థితిని తీసుకవస్తుంది. కావున అందరూ ఆహారం విషయంలో తిరోగమనం వైపు ప్రయాణిస్తున్నారు. వెనుకటి ఆహర పదార్ధాల పైపు మెుగ్గు చూపుతున్నారు. వాటిలో ముఖ్యంగా కొర్రలను చాలా మంది ఇష్టపడుతున్నారు. చిరు ధాన్యాలతో ఒకటైన కొర్రలతో అంబలి తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్ రోగులు కొర్ర బియ్యం మంచి ఔషధంలా పనిచేస్తుంది. వాటిలో రక్తంలో చక్కెర శాతాన్ని పూర్తిగా అదుపులో ఉంచుతుంది. ఉదరసంబంధ సమస్యలకు కొర్ర బియ్యంతో చక్కటి పరిష్కారం లభిస్తుంది.

కడుపులో నొప్పిగా ఉండడం ఆకలి ఉండకపోవడం అజీర్తి సమస్యలకు ఇది చక్కగా పనిచేస్తుంది. జీర్ణనాళాన్ని శుభ్రం చేయడంలో వీటి పాత్ర ప్రముఖ ఉంటుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. గుండె జబ్బులు రాకుండా రక్షిస్తుంది . కొర్రలను అంబలిగా ఎలా చేసుకోవాలో చూద్దాం.. కొర్రలను రాత్రి శుభ్రం చేసుకుని నీటిలో నానబెట్టాలి. ఉదయం పూట కొర్రలను ఉడికించి అంబలిలా కాచుకోవాలి. దానిలో ఉప్పును వేయాలి.

కొర్రల గంజి, అంబలి తయారు చేసుకోవడానికి మట్టి కుండలు శ్రేష్టమైనవి. అంబలిని త్రాగే ముందు, మిరియాలు లేక జీలకర్ర వాము వంటి పొడులను కలుపుకుని తీసుకోవడం మంచిది. పెరుగు, మజ్జిగను కూడా చేర్చుకోవచ్చు. దానికి ఆవకాయతో కొర్రల అంబలిని అడ్ చేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories