యమ్మీ చేపల కూర తయారీ ఎలా..?

యమ్మీ చేపల కూర తయారీ ఎలా..?
x
Highlights

చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. వీటిలో18-20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ,...

చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. వీటిలో18-20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కె విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది.

కావలసిన పదార్ధాలు :

చేప ముక్కలు: ముప్పావుకిలో ఆవాలు

చేపలకూర మసాలా

కారం

దనియాల పొడి

కొబ్బరి తురుము

చిన్నఉల్లిగడ్డలు

వెల్లుల్లిరెబ్బలు

మెంతులు

సోంపు

జీలకర్ర

ఎండుమిర్చి

నూనె

ఉల్లిగడ్డ ముక్కలు

అల్లం

పచ్చిమిర్చి

కరివేపాకు

టమాట

చింతపండు

తయారీ విధానం :

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. చేపల కూర కోసం మస్టర్డ్ నూనెను వాడుకోవాలి.. ఇందులో మెంతులు, సోంపు జీలకర్ర వేసుకోవాలి...ఎండుమిర్చిని ఆడ్ చేసుకోవాలి.తరువాత చిన్న ఉల్లిగడ్డలను వేసుకోవాలి. సిమ్ లో కుక్ చేసుకోవాలి..ఇప్పుడు కొబ్బరి తురుమును వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. వీటన్నింటిని ఆరబెట్టి గ్రైండ్ చేసుకోవాలి..మట్టి పాత్రను స్టవ్ మీద పెట్టుకోవాలి..నూనె వేసుకున్న తరువాత ఆవాలు ఉల్లిగడ్డ ముక్కలను అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకోవాలి..తరువాత టమాట ముక్కలను వేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చింతపండు పులుసును వేసుకోవాలి. దనియాల పొడి, కారం, చేపల కూర మసాలాను వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్ రెడీ గ్రైండ్ చేసి పెట్టకున్న పేస్ట్ ను వేసుకోవాలి. కొంచెం నీటిన కూడా పోసుకోవాలి. కళ‌్లుప్పును సరిపడినంత వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి..ఇప్పుడు .5 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను ఇందులో వేసుకుని 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేయాలి. స్టవ్ ఆఫ్ ఆఫ్ చేస్తే... చేపల కూర రెడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories