Falooda: వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఏమి చేయాలి?

Falooda: వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఏమి చేయాలి?
x
Highlights

సమ్మర్ వచ్చేసింది.. అవునండోయ్, మధ్యాహ్నం వేడి సెగలు మెళ్లి మెళ్లిగా వీస్తున్నాయి. ఇంకొన్ని రోజులు పోతే భానుడు తన ప్రభావాన్ని చూపించక మానడు... పగలంతా...

సమ్మర్ వచ్చేసింది.. అవునండోయ్, మధ్యాహ్నం వేడి సెగలు మెళ్లి మెళ్లిగా వీస్తున్నాయి. ఇంకొన్ని రోజులు పోతే భానుడు తన ప్రభావాన్ని చూపించక మానడు... పగలంతా సూర్యుడి భగభగలకు బలికాక తప్పదు.. మరి వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి. కడుపులో చల్లగా ఏదైనా ఒకటి పడాల్సిందే... బయటి ఆహారంపై భద్రత లేదు కాబట్టి.. ఇంట్లోనే చక్కటి వాతావరణంలో ఆరోగ్యకరమైన పండ్లతో చక్కటి జ్యూస్‌లతో పాటు పానియాలను తయారు చేసుకోవచ్చు.. మరి ఎప్పుడు పండ్ల రసాలేనా.. కాస్త టేస్ట్ మార్చుదాం అనుకునే వారు ఫలూదా తాగాల్సిందే.. ఫలూదాకు ఫిదా కానివారంటూ ఎవరూ లేరు.. మరి ఇంట్లో ఎంచక్కా ఫ్రూట్ ఫలూదా ఎలా తయారు చేసుకుంటారో ఒసారి చూసేద్దాం పదండి.

కావాల్సిన పదార్ధాలు :

* ఫలూడా సేవ్

* పాలు

* సబ్జా గింజలు

* యాపిల్

* అరటి

* పైనాపిల్

* దానిమ్మగింజలు

* రోజ్ సిరప్

* కండెన్స్‌డ్ మిల్క్‌

తయారీ విధానం :

మదుంగా సేవ్‌ను హాఫ్ బాయిల్ చేసుకుని సిద్ధంగా పెట్టుకోవాలి.. ఫలూదా తాగేది కాబట్టి పొడవాటి గాజు గ్లాసును తీసుకోవాలి.. ముందుగా ఈ గ్లాస్‌లో అల్‌రెడీ సిద్ధంగా పెట్టుకున్నఅరకప్పు సేవ్‌ను వేసుకోవాలి... ఇప్పుడు మరిగించి చల్లార్చి పెట్టుకున్న ఒకకప్పు పాలు పోసుకోవాలి... ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలను వేసుకోవాలి.. ఇప్పుడు చెంచాడు రోజ్‌ సిరప్‌ వేసుకోవాలి... ఆ తరువాత యాపిల్‌ , అరటి , పైనాపిల్ ముక్కలను చిన్నగా కట్‌ చేసి వేసుకోవాలి. కుదిరితే... ద్రాక్షా పండ్లను వేసుకోవచ్చు.. టేస్ట్‌ని బట్టి. ఇప్పుడు పావు కప్పు కండెన్స్‌డ్ మిల్క్‌ వేసుకోవాలి.. ఇవి సూపర్ మార్కెట్‌లో విరివిగా లభిస్తాయి... ఇప్పుడు ఈ గ్లాస్‌ను రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి... తరువాత బయటకు తీసి చివరగా దానిమ్మ గింజలతో అలంకరించాలి. అంతే కూల్‌ కూల్ ఫలూదా రెడీ. ఈ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ గా ఆరగించేయొచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories