ఎగ్‌ లెస్ పైనాపిల్ పేస్ట్రీ తయారీ ఎలా?

ఎగ్‌ లెస్ పైనాపిల్ పేస్ట్రీ తయారీ ఎలా?
x
Highlights

బేకరీలకు వెల్లడం కన్నా ఇంట్లోనే సింపుల్ గా టేస్టీగా పైనాపిల్ పేస్ట్రీని రెడీ చేసుకోవచ్చు.

బేకరీలకు వెల్లడం కన్నా ఇంట్లోనే సింపుల్ గా టేస్టీగా పైనాపిల్ పేస్ట్రీని రెడీ చేసుకోవచ్చు. ఎగ్‌ అవసరం లేకుండా పేస్ట్రీని ఎలా తయారు చేసుకోవాలో చూడండి.

కావాల్సిన పదార్ధాలు:

పైనాపిల్ ముక్కలు : రెండు కప్పులు

♦ చెక్కర : సరిపడినంత

♦ పాలు : ఒక కప్పు

♦ వెనిగర్ : టేబుల్ స్పూన్‌లు

♦ బటర్ : పావు కప్పు

♦ మైదా : ఒక కప్పు

♦ వెనీలా ఎసెన్స్ : రెండు టీస్పూన్‌లు

♦ విప్పింగ్ క్రీం

♦ కార్న్‌ ఫ్లోర్ : టేబుల్ స్పూన్

♦ వంట సోడా : పావు టీస్పూన్

♦ బేకింగ్ పౌడర్ : టీస్పూన్

♦ ఉప్పు: చిటికెడు

తయారీ విధానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్‌స్టిక్ పాన్‌ పెట్టుకోవాలి. అందులో చిన్నగా కట్‌చేసుకుని పెట్టుకున్న కప్పు పైనాపిల్ ముక్కలను వేసుకోవాలి..అందులోనే అరకప్పు చక్కెర వేసుకోవాలి....ఇందులోనే అరకప్పు నీరు వేసి 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి...పైనాపిల్ ముక్కలు కాస్త ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసి ముక్కలను చల్లారనివ్వాలి...ఇప్పుడు ఒక కప్పు పాలు తీసుకోవాలి. పాలను బాగా మరిగించి చల్లార్చుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి కలుపుకోవాలి. 10 నిమిషాలు పాటు పాలను పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఉడికించిన పైనాపిల్ ముక్కలను తీసుకుని వాటి నుంచి షుగర్ సిరప్‌ను వేరే గిన్నెలోకి తీసుకుని ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఇప్నపుడు పైనాపిల్ ముక్కలను గ్రైండర్ లోకి తీసుకుని పేస్ట్‌ చేసుకోవాలి. పైనాపిల్ మిక్స్‌ రెడీ అయిన తరువాత ఇప్పుడు కేక్ తయారీ కోసం గిన్నె తీసుకుని గిన్నె లోపల నూనెనురాలి...ఆ తరువాత మైదా పిండితో కోటింగ్ చేసుకోవాలి. కేక్ పాన్ లేకపోతే సిల్వర్ బౌల్‌లో కూడా కేక్‌ను రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో పావు కప్పు బటర్‌ను వేసుకోవాలి. ఇందులో ఒక కప్పు పంచదార పొడిని వేసుకోవాలి.

అందులోనే వెన్నిగర్ కలిపిన పాలను ఆడ్ చేసుకోవాలి... వీటన్నింటిని బాగా కలుపుకోవాలి...ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని ఒక కప్పు మైదా పిండి, పావు టీస్పూన్ వంట సోడా, టీస్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు వేసుకుని బాగా జల్లడ పట్టి వాటిని పాల మిశ్రమంలో వేసుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలి. పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ , టీసపూన్ గ్రైండ్ చేసుకున్న పైనాపిల్ పేస్టును వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్‌ను కేకె పాన్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టాలి...అందులో ఇసుక వుసుకోవాలి.. అందులో కేక్ పాన్‌ పట్టే విధంగా చూసుకోవాలి...ఇప్పుడు కేక్ గిన్నె పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టి 25 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి...ఇప్పుడు కేక్ ను బయటకు తీసుకోవాలి...చల్లారే వరకు చూసుకోవాలి..

ఇప్పుడు విప్పింగ్ క్రీం రెడీ చేసుకోవాలి. కప్పు విప్పింగ్ క్రీంన్‌ను కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి..తరువాత మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.. క్రీంను బాగా బీట్ చేసుకోవాలి...ఇందులో కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే పావు టీస్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి బాగా బీట్ చేసుకోవాలి...ఇప్పుడు క్రీం రెడీ అయ్యింది. అరకప్పు పైనాపిల్ మిక్స్‌ తీసుకుని అందులో వాటర్ వేసుకుని పాన్‌లోకి ఫిల్టర్ చేసి తీసుకోవాలి... ఇందులో రెండు టేబుల్ స్పూన్ ల కార్న్ ఫ్లోర్ వేసి కరిగించి స్టవ్ ఆన్ చేసి మరిగించాలి.

ఇందులో 4 టీస్పూన్ ల పంచదార వేయాలి..చిక్కబడే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చాలి...ఇప్పుడు కేక్‌ను డీమోల్డ్ చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కేక్‌ను రెండు లేయర్లుగా కట్ చేసుకోవాలి...ఇప్పుడు కింద లేయర్‌ను పెట్టి పైనాపిల్ షుగర్ సిరప్ వ్రాసి ఆ తరువాత పైనాపిల్ పేస్ట్‌ని రాయాలి. ఇప్పుడు విప్పడ్ క్రీంమ్ ను అప్లై చేయాలి...ఇదే విధంగా రెండో లేయర్ ను పెట్టి సేమ్ ప్రాసెస్‌ను పాటించాలి. ఇప్పుడు కేక్ చుట్టూ విప్పడ్ క్రీం అప్లే చేసుకోవాలి...అంతే ఎగ్‌ లెస్ పైనాపిల్ పేస్ట్రీ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories