వేసవి సమయంలో పెరుగన్నం ఒంటికి మంచిది..

వేసవి సమయంలో పెరుగన్నం ఒంటికి మంచిది..
x
Highlights

తయారీకి కావాల్సిన పదార్ధాలు : బియ్యం: 150 గ్రాముల పచ్చిమిర్చి :‌ రెండు అల్లం: సరిపడినంత కరివేపాకు : సపరిపడినంత ఆవాలు, ఇంగువ : టేబుల్ స్పూన్ ...

తయారీకి కావాల్సిన పదార్ధాలు :

బియ్యం: 150 గ్రాముల

పచ్చిమిర్చి :‌ రెండు

అల్లం: సరిపడినంత

కరివేపాకు : సపరిపడినంత

ఆవాలు, ఇంగువ : టేబుల్ స్పూన్

దానిమ్మగింజలు,

నూనె: కావాల్సినంత

పాలు : అరలీటరు

పెరుగు : మూడు టేబుల్ స్పూన్‌లు

తయారీ విధానం

ముందుగా కుక్కర్‌లో బియ్యం వేసుకుని నాలుగు గ్లాసుల నీరు పోసుకోవాలి. ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అన్నం బాగా ఉడికిన తరువాత...ఇప్పుడు అన్నాన్ని కలుపుకోవాలి.. వేడిగా అన్నం ఉన్నప్పుడే..గరిటెతో మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న తరవువాత ఇందులో ఆల్‌రెడీ మరిగించి చల్లార్చి పెట్టుకున్న అరలీటరు పాలను పోసుకోవాలి. కొంచెం కొంచెంగా పాలు పోసుకుని అన్నాన్ని మెత్తగా చేసుకుంటూ పాలు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, ఇంగువ వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇందులో దానిమ్మ గింజలు కూడా వేసుకోవాలి. ఇప్పడు స్టవ్ మీద ప్యాన్‌ను పెట్టి ఆన్ చేసుకోవాలి. ఇందులో ఆవాలు, కరివేపాకు వేసి పోపు వేసుకోవాలి...దీనిని అన్నంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తోడు కోసం తీసి పెట్టుకున్న మూడు టేబుల్ స్పూన్‌ల పెరుగును కూడా అన్నంలో వేసుకుని కలుపుకోవాలి. పెరుగన్నం రెడీ..వేసవి సమయంలో పెరుగన్నం ఒంటికి చాలా మంచి చేస్తుంది...కాబట్టి...కాస్త గాబరాగా ఉన్నా...అన్నం తినాలనిపించకున్నా...ఇంట్లోనే ఇలా రెడీ మేడ్‌గా పెరుగన్నాన్ని టేస్టీగా తయీరుచేసుకుని తింటే చాలు..హాయిగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories