రుచికరమైన గుత్తి గోరుచిక్కుడు కూర తయారీ ఎలా?

రుచికరమైన గుత్తి గోరుచిక్కుడు కూర తయారీ ఎలా?
x
Highlights

గోరుచిక్కుడు తో మనం వివిధ రకాల వంటకాలు చేస్తుంటాము.. అన్ని రొటీన్ గానే ఉంటాయి.. కానీ మనం ఇప్పుడు చేసుకోబోయేది వెరైటీ డిష్.

గోరుచిక్కుడు తో మనం వివిధ రకాల వంటకాలు చేస్తుంటాము.. అన్ని రొటీన్ గానే ఉంటాయి.. కానీ మనం ఇప్పుడు చేసుకోబోయేది వెరైటీ డిష్.. జనరల్ గా గుత్తి వంకాయ, గుత్తి దొండ, గుత్తి బెండకాయ కూరలను చూసి ఉంటారు.. ఇప్పుడు మీకోసం గుత్త గోరుచిక్కుడు కూరను పరిచయం చేస్తున్నాము.. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది... జొన్న రొట్టెలకు, అన్నంలోకి ఈ కర్రీ మంచి సైడ్ డిష్.

కావాల్సిన పదార్ధాలు:

గోరుచిక్కుడు

♦ శనగపిండి

♦ ఇంగువ

♦ కొత్తిమీర

♦ పచ్చిమిర్చి

♦ వెల్లుల్లి రెబ్బలు

♦ పెరుగు

♦ కారం

♦ దనియాల పొడి

♦ గరం మసాలా

♦ పసుపు

♦ కొత్తిమీర

♦ జీలకర్ర పొడి

♦ జీలకర్ర

♦ ఉప్పు

తయారీ విధానం:

ఈ గుత్తి గోరుచిక్కుడు కూరకోసం ముందు గోరుచిక్కుల్లలో పట్టించేందుకు మసాలాను తయారు చేసుకోవాలి.. కూరను మట్టి పాత్రలో చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది.. అందుకనే ముందుగా స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్ర పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్‌ల నూనె పోసుకోవాలి... నూనె కాస్త కాగాకా అందులో ఒక కప్పు శనగపిండి వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి... పిండి నూనెలో బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే రుచికిసరిపడా ఉప్పు , కాస్త ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి.. కాసేపు స్టవ్ మీద ఉంచి తీసివేయాలి. ఈ మిశ్రమాన్ని కాస్త పక్కన పెట్టుకుని ఇప్పుడు రోట్లో 20వెల్లుల్లి రెబ్బలు, రెండు పచ్చిమిర్చి , అరటీస్పూన్ కారం, ఉప్పు , దనియాల పొడి వేయాలి...వీటిని బాగా నూరుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర తరుగు వేసుకుని వాగా నూరాలి...రోలు లేకపోతే...మిక్సిలో గ్రైండ్ చేసుకోవచ్చు.

ఈ మిశ్రమాన్ని ఆల్‌రెడీ రెడీ చేసి పెట్టుకున్న శనగపిండిలో వేసుకుని ముద్దలా కలుపుకోవాలి.ఇప్పుడు గోరుచిక్కుళ్లను బాగా కడిగి పెట్టుకోవాలి...వీటిని నిలువునా కట్ చేసుకోవాలి. ఈ శనగపిండి మసాలాను కొద్దికొద్దిగా తీసుకుని గోరుచిక్కుళ్లకు పట్టించాలి...ఇప్పడు ఈ స్టఫడ్ గోరుచిక్కుళ్లను ఓ మట్టి పాత్రలోకి తీసుకోవాలి..మరో మట్టిపాత్రను తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో నీరు పోసి మరిగించాలి..ఇప్పుడు గోరుచుక్కళ్ల పాత్రను అందులో పెట్టి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు స్టీమ్‌ మీద చిక్కులను ఆవిరి మీద కుక్ చేసుకోవాలి. గోరుచిక్కుళ్లు ఉడికాక పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు ఒక గిన్నె తీసుకని అందులో పెరుగు, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు ,దనియాల పొడి, జీరలకర్ర పొడని వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నూనె పోసి జీలకర్ర వేసి అందులో పెరుగు మిశ్రమాన్ని వేయాలి. బాగా కలుపుతూ ఉండాలి.ఎక్కడా ఉండలు కట్టకుండా చూసుకోవాలి. మిశ్రమం బాగా దగ్గరికి అయ్యాక ఇప్పుడు స్టఫడ్ గోరు చిక్కుళ్లను ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి..కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి..5 నుంచి 10నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతే.... జొన్నరొట్టెల్లోకి , అన్నంలోకి ఎంతో టేస్ట్ సైడ్ డిష్ గుత్తి గోరుచిక్కుడు కూర రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories