చింత చిగురు పులిహోర తయారీ ఎలా..?

చింత చిగురు పులిహోర తయారీ ఎలా..?
x
Highlights

తరచు చింత చిగురును తింటే ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్‌తో బాధపడేవారు చింత చిగురును తమ ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుండె...

తరచు చింత చిగురును తింటే ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్‌తో బాధపడేవారు చింత చిగురును తమ ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుండె జబ్బులను చింత చిగురు దరిచేరనీయదు. శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చింత చిగురును పేస్ట్‌లా చేసి కీళ్ళపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.-

కావలసిన పదార్ధాలు :

బియ్యం – 2 కప్పులు

చింత చిగురు – ఒక కప్పు

పచ్చి సెనగపప్పు – ఒక టీ స్పూను

మినప్పప్పు – ఒక టీ స్పూను

ఆవాలు – అర టీ స్పూను

ధనియాలు – ఒక టీ స్పూను

పసుపు – పావు టీ స్పూను

వేయించిన పల్లీలు – రెండు టేబుల్‌ స్పూన్లు

జీడి పప్పులు – 15

ఎండు మిర్చి – 5

ఇంగువ – అర టీ స్పూను

నూనె – 2 టేబుల్‌ స్పూన్లు

ఉప్పు – తగినంత

కరివేప – 2 రెమ్మలు

పచ్చి మిర్చి – 4

తయారీ విధానం:

ముందుగా చింత చిగురును శుభ్రంగా కడగాలి. తరువాత పొడి వస్త్రం మీద ఆరబెట్టాలి. ►బియ్యానికి తగినన్ని నీళ్లు పోసి అన్నం వండాలి. వేడిగా ఉండగానే ఒక పెద్ద పాత్రలోకి ఆరబోయాలి..స్టౌ మీద గిన్నె పెట్టి అందులో నూనె వోయాలి. నూనె కాగాక ఎండు మిర్చి, ధనియాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, వేయించిన పల్లీలు వేసి వేయించాలి. ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఇందులోనే చింతచిగురు జత చేసి మరోసారి మిక్సీ పట్టాలి. స్టౌ మీద కడాయి పెట్టి అందులో నూనె సోయాలి.నూనె కాగాక ఆవాలు, పసుపు, ఎండు మిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి

చింత చిగురు మిశ్రమం వేసి బాగా కలిపి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి కలపాలి. ఉప్పు, జీడి పప్పులు జత చేసి మరోసారి కలపాలి. గంటసేపు అలా ఉంచి ఆ తరవాత తినాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories